ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​@5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

latest news, top ten, 5pm news
top news, etv bharat top news
author img

By

Published : Apr 7, 2021, 5:00 PM IST

1.కట్టడి ఎలా..!

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రి ఈటల రాజేందర్​ సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సేవ చేయండి..

కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా... సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలన్న కోర్టు...6 నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. గ్రీన్​ సిగ్నల్​

ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కీచక తండ్రికి జీవిత ఖైదు

హైదరాబాద్​లో కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి సైబరాబాద్​ మెట్రోపాలిటన్​ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. పోక్సో చట్టం కింద బాలిక తండ్రికి కోర్టు శిక్షను ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.అంతా 'షా'నే చేశారు..

బంగాల్‌లో ఓటర్లను సీఆర్​పీఎఫ్​ సిబ్బంది వేధిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. జల ప్రళయం

ఇండోనేసియాలో వరద బీభత్సం కారణంగా ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 126కు చేరిందని అధికారులు తెలిపారు. అనేక మంది గల్లంతైనట్లు వివరించారు. సెరోజా తుపాను ప్రభావానికి పలు దీవుల్లో రహదారులు దెబ్బతిన్నాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.పసిడి ధరకు రెక్కలు

దేశీయంగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దాదాపు రూ.600 ఎగబాకింది. వెండి ధర కిలో రూ.65 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. బుల్​ జోరు

బుధవారం సెషన్​ను స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు పెరిగి.. 49,661 మార్కును చేరింది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.షెడ్యూలు ప్రకారమే..

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​తో పాటు టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​ను అనుకున్న తేదీ ప్రకారం నిర్వహిస్తామని ఐసీసీ మధ్యంతర సీఈఓ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన వర్చువల్​ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సినిమా కబుర్లు

'ఆర్​ఆర్​ఆర్'​ యూఎస్​ఏ థ్రియేట్రికల్​ రైట్స్​ను సరిగమ సినిమాస్​, రఫ్తార్​ క్రియేషన్స్​ దక్కించుకున్నాయి. 'వకీల్​సాబ్'​ సినిమాలోని 'కదులు కదులు' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.