వీడుతున్న మిస్టరీ
వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట బావిలో మృతదేహాలపై ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతుంది. ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వివరాలు బయటపడుతున్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఇవాళ 9మృతదేహాలకు శవపరీక్ష పూర్తయింది. బతికుండగానే బావిలోకి నెట్టి చంపారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమ్మకానికి స్వామి వారి ఆస్తులు
తమిళనాడులోని శ్రీవారి స్థిరాస్తులను విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తమిళనాట 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా అమ్మాలని ఆదేశాలు జారీచేసింది. ఎప్పుడు తీర్మానం చేశారంటే...
కాంగ్రెస్ చేయూత
నల్గొండ జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 30 మంది వలస కార్మికులు స్వరాష్ట్రానికి బయలుదేరారు. కార్మికులు కోసం ఏర్పాటు చేసిన బస్సును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రాణం తీసిన మొబైల్ ఛార్జర్
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పదేళ్ల కూతురును మొబైల్ ఛార్జర్ బలితీసుకుంటుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. చరవాణికి ఛార్జింగ్ పెట్టమని ఇవ్వగా... విద్యుత్ షాక్ తగిలి బాలిక మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారంలో జరిగింది. అసలేమైందంటే...
నక్సల్ కమాండర్ హతం
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఇందులో ఒక వ్యక్తి తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
టిక్‌టాక్ కోసం పిల్లికి ఉరి
లైకుల మైకంలో పడి.. పిల్లికి ఉరివేశాడు. వీడియో వైరల్ కావాలని మూగజీవాన్ని చిత్రవధ చేశాడు. అనుకున్నట్టుగానే వీడియో బాగా వైరల్ అయ్యింది. తమిళనాడు పోలీసులు అతడి 'కిరాతక ప్రతిభ'ను గుర్తించి, అరెస్టు చేశారు.
సెకనులో వెయ్యి సినిమాలు
ఇంటర్నెట్ నుంచి ఒక సినిమా డౌన్లోడ్ చేయాలంటే కనీసం ఐదు నుంచి పది నిమిషాలు పట్టొచ్చు. కానీ ఆస్ట్రేలియా పరిశోధకులు తయారు చేసిన ఆప్టికల్ చిప్ ద్వారా సెకనుకు వెయ్యి సినిమాలు డౌన్లోడ్ చేయవచ్చట. ఆశ్చర్యంగా ఉందా?
వాట్సాప్ నయా ఫీచర్!
కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్. ప్రస్తుతం దీన్ని బీటా వెర్షన్లో పరీక్షిస్తున్నారు. ఈ ఆప్షన్‌తో ఫోన్ నంబర్లు.. ఒక్క స్కాన్‌తో యాడ్ అయిపోతాయి.
తన కెప్టెన్సీ ధోనీలా అనిపిస్తుంది
టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు కురిపించాడు సురేశ్ రైనా. అతడు కెప్టెన్సీలో ధోనీని తలపిస్తాడని చెప్పాడు. ఇంకెమన్నాడంటే..
కొత్త కథ సిద్ధమైంది!
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్న దర్శకులు కొత్త సినిమాల కోసం కథలు తయారు చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా అల్లు అర్జున్ కోసం ఓ కథ సిద్ధం చేశారట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే..?