ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్​ 7AM - telangana top ten news

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana Top News
టాప్​న్యూస్​ 7AM
author img

By

Published : Aug 15, 2022, 7:00 AM IST

Updated : Aug 15, 2022, 9:35 AM IST

  • స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబు

Independence Day 2022 స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంబరాన్నంటేలా జరుపుకునేందుకు యావత్‌ భారతావని సిద్ధమైంది. చారిత్రక వైభవానికి ప్రతీక అయిన ఎర్రకోట అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 9వ సారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఎర్రకోట పరిసరాలు భద్రతా వలయంతో శత్రు దుర్భేద్యంగా మారాయి.

  • దేశ విభజన వేళ ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని నివాళులు

'విభజన విషాద స్మృతి దినం' సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ, భాజపా సీనియర్‌ నేతలు నివాళులు అర్పించారు. నాటి విషాదకర సమయంలో బాధలకోర్చి నిలబడిన వారి మొక్కవోని ధైర్యం ప్రశంసనీయమని మోదీ ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు.

  • స్వాతంత్య్ర సంబురాలకు ముస్తాబైన రాష్ట్రం

స్వాతంత్య్ర సంబురాలకు రాష్ట్రం ముస్తాబైంది. వజ్రోత్సవాల ద్విసప్తాహంలో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేయనుండగా మంత్రులు, అధికారులు రాష్ట్రవ్యాప్త వేడుకల్లో పాల్గొంటారు.

  • బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

బిహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. వాహన కంపెనీల ప్రాంఛైజీల పేరిట సైబర్‌ మోసాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు బిహార్‌ వెళ్లారు. నవాడా జిల్లాలోని భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు.

  • జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము

Draupadi Murmu Address Nation భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారని అన్నారు ముర్ము. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని అభిప్రాయపడ్డారు.

  • మంచి నీటి కుండను ముట్టాడని దళిత విద్యార్థిపై టీచర్​ దాడి

Dalit Student Beaten to Death రాజస్థాన్​లో దారుణం జరిగింది. నీటి కుండను ముట్టాడని దళిత విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. దీంతో బాలుడు చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

  • బ్రిటన్​ ప్రధాని పదవి రేసులో లిజ్​ ట్రస్ ముందంజ, రిషికి కష్టమేనా

UK PM race బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో ఉన్న రిషి సునాక్, సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థి లిజ్​ ట్రస్​తో పోలిస్తే వెనుకంజలో కొనసాగుతున్నారు. ఒపీనియమ్‌ అనే సంస్థ చేపట్టిన సర్వేలో 570 మంది కన్జర్వేటివ్‌ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఈ సర్వేలో లిజ్ ట్రస్​కు 61 శాతం, రిషి సునాక్​కు 39 శాతం మద్దతు లభించింది.

  • బిగ్​ బుల్​ రాకేశ్​ ఝున్​ఝున్​వాలా అంత్యక్రియలు

Rakesh Jhunjhunwala News భారత స్టాక్​ మార్కెట్​ చక్రవర్తిగా పేరుగాంచిన రాకేశ్​ ఝున్​ఝున్​వాలాకు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. ముంబయిలోని బాణ్​గంగా శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు.

  • పుజారా వన్డేల్లో వరుసగా రెండో సెంచరీతో విధ్వంసం

Pujara Century భారత క్రికెటర్​, టెస్టు స్పెషలిస్ట్​ ఛెతేశ్వర్​ పుజారా భీకర ఫామ్​లో ఉన్నాడు. ఇంగ్లాండ్​లో జరుగుతున్న రాయల్​ లండన్​ కప్​ వన్డే ఛాంపియన్​షిప్​​లో ససెక్స్​ జట్టు తరఫున వరుసగా రెండో సెంచరీ చేయడం విశేషం.

  • మాళవిక మోహనన్​ అందాల జాతర, మానుషి హాట్​ ట్రీట్​

తమిళ హీరోయిన్​ మాళవిక మోహనన్​, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తమ కొత్త ఫొటోషూట్స్​తో హీట్​​ పెంచారు. ఇవి సోషల్​ మీడియాలో నెటిజన్లకు చెమటలు పట్టిస్తున్నాయి. వాటిని మీరూ చూసేయండి.

Last Updated : Aug 15, 2022, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.