ETV Bharat / state

BIOGAS: ఈ మార్కెట్లో కూరగాయల వ్యర్థాలతో కరెంట్‌ ఉత్పత్తిచేస్తారు.. - Biogas plants in Hyderabad

Boinpally Biogas Plant: గ్రీన్ ఎనర్జీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రస్తావన. వాతావరణ మార్పుల నేపథ్యం, పర్యావరణహితం దృష్ట్యా గ్రీన్‌ఎనర్జీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా.. ప్రత్యేకించి భారతదేశంలో గ్రీన్‌ఎనర్జీ ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ వేదికగా సీఎస్‌ఐఆర్‌, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ- ఐఐసీటీ ఆధ్వర్యంలో అహూజా సంస్థ ఏర్పాటు చేసిన బయోగ్యాస్‌ ప్లాంట్‌ సత్ఫలితాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేస్తారు.? బోయిన్‌పల్లిలోని బయోగ్యాస్‌ ప్లాంట్‌ సేవలు ఎలా ఉన్నాయి.? దాన్నుంచి ఉత్పత్తైన విద్యుత్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ను ఎలా వినియోగిస్తున్నారు.

Biogas
Biogas
author img

By

Published : Apr 19, 2023, 5:01 PM IST

సత్ఫలితాలిస్తున్న బోయిన్‌పల్లి బయోగ్యాస్‌ ప్లాంట్

Boinpally Biogas Plant: ప్రపంచవ్యాప్తంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ రంగం.. ఆ రంగం అనే తేడాలు లేకుండా అన్నింటా దీని హవా కొనసాగుతోంది. అదే స్ఫూర్తితో వ్యర్థాల నుంచి కూడా సంపద సృష్టి జరుగుతోంది. ఇదే కోవలో ప్రయత్నాలు చేసిన సీఎస్‌ఐఆర్‌- ఐఐసీటీ ఆవిష్కరణలు యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ను ఉత్పత్తి కోసం 2020 మార్చిలో బోయిన్‌పల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో సీఎస్‌ఐఆర్‌- ఐఐసీటీ ఆధ్వర్యంలో అహూజా సంస్థ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది.

గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్‌ ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. 10 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్‌ ప్లాంట్‌లో మార్కెట్‌లో నిత్యం వెలువడుతున్న కూరగాయలు, పండ్లు, పూలు వ్యర్థాల ద్వారా 500 యూనిట్ల విద్యుత్తు, 30 కిలో ఎల్‌పీజీ గ్యాస్ ఉత్పత్తవుతోంది. ఇక మిగిలిన వ్యర్థాలను ఉపయోగించి సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయిస్తుండటం ఈ ప్లాంట్‌ ప్రత్యేకత.

కేంద్ర బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయంతో అనారోబిక్ గ్యాస్ రియాక్టర్- ఏజీఆర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో 3 కోట్ల రూపాయల వ్యయంతో బోయిన్‌పల్లి బయోగ్యాస్‌ ప్లాంట్‌ను స్థాపించారు. ప్లాంట్‌కు అవసరమైన స్థలం, మౌలిక సదుపాయాలు, నిర్వహణ బాధ్యతలను మార్కెటింగ్ శాఖ సమకూర్చింది. 2020లో మొదలైన ప్లాంట్‌ సేవలకు గాను 2021లో సీఎస్‌ఐఆర్‌ టెక్నాలజీ అవార్డు, సీసీఐ ఆధ్వర్యంలో అత్యంత ఆవిష్కరణల పురస్కారం అందుకుంది. 2022లో దేశంలో టాప్‌ 10 ట్రాన్స్‌ఫర్మేషనల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా నిలిచింది.

"సీఎస్‌ఐఆర్, ఐఐసీటీ కలిసి ఈ బోయిన్‌పల్లి బయోగ్యాస్‌ ప్లాంట్‌ స్థాపించడం జరిగింది. ఇక్కడ కూరగాయల వ్యర్థాలతో ఇంధనం తయారు చేస్తున్నాం. దీనిని మూడు రకాలుగా మనం వినియోగించుకోవచ్చు. వంట గ్యాస్‌, కరెంట్‌ తయారీ, ఇంధన అవసరాలుకు ఈ బయోగ్యాస్‌ వినియోగిస్తాం. 10 టన్నుల వ్యర్థాలతో.. 500 యూనిట్లు విద్యుత్, 30 కిలోల జీవఇంధనం ఉత్పత్తి చేసి దానిని మార్కెట్‌ అవసరాలకు వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో త్వరలోనే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో కూడా బయోగ్యాస్ ప్లాంట్లు నెలకొల్పేందుకు సమయాత్తం చేస్తున్నాం". డాక్టర్ ఎ.గంగాగ్నిరావు, చీఫ్ సైంటిస్ట్

అవార్డుల పంట: అదే ఏడాది ఐఐసీటీ టెక్నాలజీ అవార్డు, ది బయోటెక్‌ రీసెర్చ్ సొసైటీ ఇండియా ఇండస్ట్రియల్ అవార్డు లభించింది. ఈ బయోగ్యాస్ ప్లాంట్‌ ఆవిష్కరణ, నిర్వహణను గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం.. మన్‌ కీ బాత్‌లో అభినందించారు. తాజాగా ఈ ఏడాది కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రశంసించడం పట్ల సీఎస్‌ఐఆర్‌- ఐఐసీటీ శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

మరిన్నీ బయోప్లాంట్‌ల విస్తరణకు ప్రణాళికలు: బోయిన్‌పల్లి బయోగ్యాస్‌ సత్ఫలితాలు అందిస్తున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఇంటిగ్రేటెడ్‌ కూరగాయలు, మాంసం మార్కెట్లలో బయోడైజెస్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. బయోడైజెస్టర్ల స్థాపన ద్వారా గ్రీన్ఎనర్జీ ఉత్పత్తి సులభతరం చేయడమే కాక పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఈ మార్కెట్లలోని వ్యర్థాలను శాస్త్రీయంగా పారవేయడంలో సహాయపడతాయి. ఇది కనీస పెట్టుబడి, గరిష్ట ప్రయోజనాలతో ప్రణాళిక చేసినది. ప్రత్యేకించి మార్కెట్లలో వ్యర్థాలు శూన్య స్థాయికి చేరుకుంటాయి. సామర్థ్యాన్ని బట్టి ఒక బయోడైజెస్టర్‌ ఇన్‌స్టాలేషన్‌కు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

కూరగాయల వ్యర్థాల నుంచి ఉత్పత్తి అవుతున్న ఇంధన వనరులు మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీనిద్వారా విద్యుత్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగంలో స్వయం సమృద్ధి సాధించిన బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ ఇతర మార్కెట్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సాగుతుండటం ఓ శుభపరిణామని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

హైందవ సంస్కృతిని ప్రతిబింబించేలా యాదాద్రిలో శిలాఫలకం

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్​- చైనా రికార్డ్ బ్రేక్

1300 కళ్లు.. 300 కెమెరాలు.. నిఘా నీడలో సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.