"కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలవొచ్చు. ఇందుకు చేయాల్సింది... ఈ వ్యాధి గురించిన భయాన్ని ముందుగా వదిలేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. తాము కరోనా వైరస్‌తో పాటు జీవనం గడపడం అనివార్యం అనే భావన పెంపొందించుకోవాలి. ఆలోచన - ఆచరణ - ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. వైద్య పరంగా ఈ వ్యాధికి ముగింపు వచ్చే కంటే... సామాజికంగా మనో నిబ్బరంతో అడుగులు వేయడం ద్వారానే సులభంగా తక్కువ కాలంలో కరోనా నుంచి దూరం కావొచ్చు" అని చెబుతున్నారు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ తెలుగు వైద్య నిపుణులు.. డాక్టర్ ముక్కామల అప్పారావు.
ఈ కరోనా వ్యాధినిర్ధరణలో సీటీ స్కాన్ పాత్ర, శరీరంలో ఆక్సిజన్‌స్థాయిలను పరిశీలిస్తూ ఉండాల్సిన ఆవశ్యకత, ఆహార – వ్యాయామాలకు సంబంధించి మరెన్నో విలువైన సూచనలు చేశారు. కరోనాకు ముందు కరోనా తర్వాత అనేరీతిలో జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని తెలిపారు. దేశంలో కరోనా వైరస్ నిర్ధరణకు చేస్తోన్న పరీక్షల సంఖ్య 3 నెలలతోపోలిస్తే బాగా పెరగడం శుభపరిణామమే... కానీ కరోనాను సమర్థంగా నియంత్రించటానికి అదిమాత్రమే సరిపోదంటున్నారు.. డాక్టర్ అప్పారావు. ప్రపంచ వ్యాప్తంగా అంటువ్యాధులు- మహమ్మారులు వణికించినా- వాటి తీవ్రత భారతదేశం వరకు చేరుకోవడంలో ఆలస్యమైనా- ఎక్కువ ప్రభావం చూపించేది భారతీయులనే అనే భావన అంతర్జాతీయంగా ఉందని కరోనా కేసుల్లో ప్రపంచలోనో నంబర్ 1 స్థానానికి భారతదేశం చేరుకోకుండా ఉంచడం.. ప్రతి ఒక్కరి చేతుల్లోను... చేతల్లోనే ఉందన్నారు.
ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి.