ETV Bharat / state

దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

author img

By

Published : Feb 18, 2020, 5:45 PM IST

డిజిటల్ మీడియాలో 'ఈటీవీ భారత్' మరో ఘనత సాధించింది. దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ అవార్డును గెలుచుకుంది. ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి.. దిల్లీలో ఈ పురస్కారం అందుకున్నారు.

wan ifra award for etv bharat
wan ifra award for etv bharat

డిజిటల్ మీడియా రంగంలో దూసుకెళుతున్న 'ఈటీవీ భారత్' అరుదైన ఘనత సాధించింది. దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ అవార్డును గెలుచుకుంది. డిజిటల్ మీడియాలో ఉత్తమ ఆవిష్కరణలకు గాను... వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ సంస్థ 'వాన్-ఇఫ్రా' ఈ పురస్కారాన్ని అందించింది. ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి చెరుకూరి దిల్లీలో అవార్డు అందుకున్నారు.

ది క్వింట్ వ్యవస్థాపక డైరెక్టర్ రీతూకపూర్ చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. దాదాపు 100కు పైగా దేశాలకు చెందిన వివిధ వార్తాపత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, పబ్లిషింగ్ సంస్థలు వాన్​లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. వాన్-ఇఫ్రా దక్షిణాసియా డిజిటల్ మీడియా-2020 సదస్సును దిల్లీలో నిర్వహిస్తోంది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు సదస్సు జరగనుంది. డిజిటల్ మీడియా విస్తృతి, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, మార్కెటింగ్ వంటి అంశాలపై రెండు రోజుల సదస్సులో చర్చిస్తారు.

దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.