ETV Bharat / state

కరోనాతో... ఆ తర్వాత ఇబ్బందే..!

author img

By

Published : Apr 13, 2020, 10:37 AM IST

కరోనా వైరస్​ తీవ్రంగా సోకిన వారికి కోలుకున్న తర్వాత కూడా ఇబ్బందులుంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 సోకిన వ్యక్తులలో 15శాతం మందికి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని.. వీరు వైరస్ నంచి కోలుకున్నాక కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని అమెరికాలోని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వర్థన్​రెడ్డి సూచిస్తున్నారు. యు.ఎస్​లో ప్రముఖ కార్డియో థోరాసిక్ సర్జన్​గా పనిచేస్తున్న ఆయన.. ఈటీవీ భారత్​తో పిట్స్​బర్గ్ నుంచి మాట్లాడారు. వైరస్ వ్యాప్తి ఈ స్థాయిలో ఉంటుందని అంచనా వేయకపోవడం వల్లే.. ప్రపంచ మానవాళి సమస్యను ఎదుర్కొంటోందన్నారు. భారత్​లో లాక్​డౌన్ అమలు చేయడం మంచి ఫలితాన్నిచ్చిందని చెప్పిన ఆయన.. పరిస్థితులను బేరీజు వేసుకుని దానిని పొడిగించే అంశాన్ని ఆలోచించాలన్నారు. మరో మూడు నెలల్లో అన్ని దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

DOCTOR INTERVIEW REPEAT
కరోనాతో... ఆ తర్వాత ఇబ్బందే..!
కరోనాతో... ఆ తర్వాత ఇబ్బందే..!

⦁ ఈటీవీ భారత్‌:- ప్రపంచం మెుత్తాన్ని కరోనా వణికిచ్చేస్తోంది. అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా కరోనాను ఎదుర్కోలేని పరిస్థితి మనకెందుకు వచ్చింది.?

⦁ డాక్టర్ వర్థన్:- కరోనా అమెరికాకు వచ్చినప్పుడు ఈ విధంగా విజృంభిస్తుందని ప్రజలు అనుకోలేదు. ఎందుకంటే ఎన్నో రకాల ఫ్లూలు వచ్చినప్పటికీ అవన్నీ నియంత్రించగలిగాం. వాటితో పోల్చితే ఇది విభిన్నమైంది. ఒక చిన్న కాంటాక్ట్​తో వ్యాధి ఇతరులకు వచ్చేస్తుంది.

⦁ ఈటీవీ భారత్‌:- ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని ఫాండమిక్​గా ప్రకటించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు. అంటే వ్యాధి నియంత్రణ పద్ధతి సరిగ్గా లేదా.. లేక వైద్యం సరిగ్గా అందించడం లేదా...? లోపం ఎక్కడుంది..?

⦁ డాక్టర్ వర్థన్:- రెండూ కారణాలే..! సామాజిక నియంత్రణ, వైద్యపరమైన నియంత్రణ రెండూ ముఖ్యమే. ఈ వ్యాధిని అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం ముఖ్యం. అది అంత సమర్ధంగా జరగలేదు. అమెరికాతో పోలిస్తే.. చైనాలో నియంత్రణా పద్ధతులు కొంచెం కఠినంగా అమలు చేశారు. అమెరికా, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది..వారిని నియంత్రించడం అంత సులువు కాదు. అందుకే అమెరికాలో వ్యాప్తి కాస్త ఎక్కువగా ఉంది.

⦁ ఈటీవీ భారత్‌:- కరోనాను నివారించటంలో వ్యక్తిగతంగా స్వీయనియంత్రణ పాటించకపోవటమా లేదా వ్యవస్థ ఫెయిల్ అయిందంటారా..?

⦁ డాక్టర్ వర్థన్: వ్యవస్థీకృత లోపాలు వివిధ స్థాయిల్లో ఉంటాయి. నేను ఇక్కడ పిట్స్​బర్గ్​లో కరోనాపై ఏర్పాటైన టాస్క్​ఫోర్స్​లో ఉన్నాను. ప్రతిరోజూ పరిస్థితిని మేం సమీక్షిస్తుంటాం. ఇది ఎంత తీవ్రమైందన్న విషయం ప్రజలు గుర్తించలేదు. పరీక్షలు నిర్వహించడంలో కూడా వైఫల్యం ఉంది. ఈ స్థాయిలో విజృంభిస్తుందని సి.డి.సి కూడా అంచనా వేయలేకపోయింది. మొదట్లో చైనా నుంచి సమాచారం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. డబ్యు.హెచ్.ఓ జనవరిలో కూడా ఇది మనిషి నుంచి మనిషికి సోకదని చెప్పింది. ఇలాంటి కారణాలతో ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి పూర్తిగా సన్నద్ధం కాలేకపోయాం.

⦁ ఈటీవీ భారత్‌:- రాజకీయ వ్యవస్థ వైఫల్యం లేదంటారా...?

⦁ డాక్టర్ వర్థన్:- కొంతవరకూ నిజమే.. ! రాజకీయ వ్యవస్థ వైఫల్యం కూడా ఉంది.

⦁ ఈటీవీ భారత్‌:- ఈ స్థాయి వైద్యపరమైన విపత్తు వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు సహాయం కోసం చూస్తుంటాయి. కానీ ఇప్పుడు అమెరికానే నిస్సహాయ స్థితిలో ఉంది?

⦁ డాక్టర్ వర్థన్:- ఇక్కడ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం.. మేం పరీక్షలు ఎక్కువగా చేస్తుండటం కూడా ఒక కారణం. దాదాపు 20లక్షలకు పైగానే పరీక్షలు చేశాం. న్యూయార్క్ వంటి పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటం కారణంగా ఈ వైరస్ తొందరగా వ్యాప్తి చెంది మరణాలు ఎక్కువయ్యాయి. ఇక్కడి ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం కూడా ఒక కారణం.

⦁ ఈటీవీ భారత్‌:- అమెరికన్ల కంటే భారతీయులకు రోగనిరోధక శక్తి ఎక్కువంటారా..?

⦁ డాక్టర్ వర్థన్:- చాలా రకాల కారణాలున్నాయి. బీసీజీ వ్యాక్సినేషన్ భారత్​లో రోగనిరోధక శక్తిని పెంచటంలో కొంతవరకూ పనిచేసింది. మన వాళ్లు ఇక్కడ రకరకాల వ్యాధికారక సమస్యలతో పోరాడుతారు కాబట్టి భారతీయుల్లో ఎక్కువగా రోగనిరోధక శక్తి ఉంటుంది.

⦁ ఈటీవీ భారత్‌:- ఆసియా దేశాలతో.. ముఖ్యంగా మలేరియా ప్రభావం ఉన్న దేశాలతో పోల్చితే పశ్చిమ దేశాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోందనే వాదన ఉంది. దీనిని ఎంత వరకూ పరిగణనలోకి తీసుకోవచ్చు.

⦁ డాక్టర్ వర్థన్:- దానిని పూర్తిగా కొట్టి పారేయలేం. దీనిపై భిన్నమైన వాదనలున్నాయి. మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడటం కారణంగా కరోనా వైరస్​ను ఎదుర్కొనే శక్తి ఈ దేశాల్లో ఉండి ఉండొచ్చు. దాని ఆధారంగా వాళ్లు ఈ వాదన చేస్తున్నారు. కొంతవరకూ అది నిజమే. కానీ పూర్తి సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు.

⦁ ఈటీవీ భారత్‌:- ఇప్పటివరకూ దీనికి ఒక స్పష్టమైన మందు లేదు అంటున్నారు. అమెరికాలో దీనిపై ఎలాంటి పద్దతి అవలంభిస్తున్నారు.?

⦁ డాక్టర్ వర్థన్: ఇంకో ఏడాదిన్నరలో వాక్సిన్ అందుబాటులోకి రావొచ్చు. ప్రస్తుతం సహాయకర వైద్య విధానాలే అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్ మేనెజమెంట్, ఫ్లూయిడ్ మేనెజ్​మెంట్​కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం.

⦁ ఈటీవీ భారత్‌:- భారతీయుడిగా మీరు ఇండియాలో పరిస్థితులను ఎలా చూస్తున్నారు.?

⦁ డాక్టర్ వర్థన్:- ఇండియాలో 21రోజుల లాక్​డౌన్ చేయడం మంచి ఫలితం ఇస్తోంది. దీనివల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉంది. దీనివల్ల కచ్చితంగా ఉపయోగం ఉంది. అమెరికాలో లాక్​డౌన్ ఉన్న ప్రాంతాలకు, లేని ప్రాంతాలకు మధ్య కేసుల్లో వ్యత్యాసం ఉంది. 21 రోజుల లాక్​డౌన్ అందరూ విధిగా పాటించాలి.

⦁ ఈటీవీ భారత్‌:- న్యూయార్క్ వంటి జనసాంద్రత ఉన్న పట్టణాలు ఇండియాలో చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగించడం అవసరమంటారా..?

⦁ డాక్టర్ వర్థన్:- లాక్ డౌన్ చేసినప్పుడు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యపరమైన అంశాలతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భారత్ లాంటి దేశాల్లో రోజువారీ కూలీలు, రోడ్లపైన వ్యాపారం చేసుకునే వారు చాలా ఎక్కువ. కొన్ని రోజులుగా వీరికి ఉపాధి పోయింది. ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి.

ఈటీవీ భారత్‌:- గుండె వ్యాధులున్న వారిపై ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఉందంటున్నారు...ఎంతవరకు నిజమంటారు.?

⦁ డాక్టర్ వర్థన్:-ఇది నిరూపితమైంది. అమెరికాలో డేటా విశ్లేషించినప్పుడు.. ఈ విషయం తేలింది. హై బీపీ, గుండెకు శస్త్ర చికిత్స జరిగినవాళ్లు, స్ట్రోక్ వచ్చినవాళ్లు.. ఎక్కువగా చనిపోతున్నారు. మధుమేహం, ఊపరితిత్తుల సమస్య ఉన్నవాళ్లకు కూడా రిస్క్ ఎక్కువగానే ఉంది. పొగ త్రాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

⦁ ఈటీవీ భారత్‌:- కరోనా ప్రభావం తగ్గాక కూడా ఆరోగ్య సమస్యలు కొనసాగే అవకాశం ఉందా..?

⦁ డాక్టర్ వర్థన్:- రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్నవారికి పెద్ద సమస్య ఉండదు. కానీ ఓ 15శాతం మందిలో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. వీరు తర్వాత కూడా సమస్యలు ఎదుర్కొంటారు. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులు, రక్తనాళాలకు మధ్య ఉన్న వాల్వ్​ను దెబ్బతీస్తుంది. వైరస్ సోకిన వారిలో 3-4 శాతం మంది చనిపోతున్నారు. 15శాతం తీవ్రంగా దెబ్బతింటున్నారు. ఇలా ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారు.. పొగత్రాగడాన్ని పూర్తిగా మానేయాలి. అది కొనసాగిస్తే ఊపిరితిత్తులు మరింత దెబ్బతింటాయి. అది వారికి ప్రాణాంతకం అవుతుంది.

⦁ ఈటీవీ భారత్‌:- ఎప్పటిలోగా ఈ పరిస్థితి నుంచి మనం బయటపడొచ్చంటారు?

⦁ డాక్టర్ వర్థన్:- రెండు మూడు వారాల్లో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలించొచ్చు. రెండు మూడు నెలల్లో 70శాతం పరిస్థితి అదుపులోకి రావచ్చు. మిగతా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కరోనా తగ్గాక కూడా చాలా విషయాల్లో మార్పులు వస్తాయి. కొంత కాలం ప్రజలు ఇలా భౌతిక దూరాన్ని పాటిస్తుంటారు. పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటారు. ఇవన్నీ మంచిదే..

ఇదీ చూడండి: ఈ ఏడాది చివరి వరకు వృద్ధులంతా క్వారం​టైన్​లోనే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.