ETV Bharat / state

మృతదేహాల నుంచి వైరస్​ సోకుతుందనేందుకు ఆధారాల్లేవ్: సీసీఎంబీ డైరెక్టర్ - corona cases in ap

యావత్ సమాజాన్ని కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్​ సోకుతుండటం చూస్తున్నాం. మరోవైపు కొవిడ్ బారిన పడి చనిపోయిన వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మృతదేహాలకు తప్పకుండా పరీక్షలు చేయాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందా..? అంతిమ సంస్కారాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? మార్కెట్లోకి వచ్చిన కరోనా ఔషధాల పనితీరు ఎంత..? వంటి పలు అంశాలపై సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కె మిశ్రా ఈనాడు-ఈటీవీ భారత్​తో తన అభిప్రాయాలు పంచుకున్నారు.

ccmb
మృతదేహాల నుంచి వైరస్​ సోకుతుందనేందుకు ఆధారాల్లేవ్: సీసీఎంబీ డైరెక్టర్
author img

By

Published : Jun 24, 2020, 8:13 PM IST

మృతదేహాల నుంచి వైరస్​ సోకుతుందనేందుకు ఆధారాల్లేవ్: సీసీఎంబీ డైరెక్టర్

ప్రశ్న: కరోనాతో మరణించిన వారి నుంచి వైరస్ సోకుతుందా..? దీనికి సంబంధించి శాస్త్రీయంగా ఏమైనా ఆధారాలున్నాయా..?

జవాబు: కరోనా వైరస్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. దగ్గటం, తుమ్మటం, వ్యక్తుల నుంచి వ్యక్తులకు వస్తోందని ఇప్పటివరకు తెలుసు. చనిపోయినవారి నుంచి వైరస్ సోకుతుందనే దానిపై శాస్త్రీయంగా ఆధారాల్లేవు. చనిపోయిన వ్యక్తి నుంచి వైరస్ సోకదనే భావించవచ్చు. కేవలం మృతదేహాం నుంచి ఏమైనా స్రావాలు బయటికి రావటం... వాటిని ఇతరులు తాకితే మాత్రం వైరస్ సోకే అవకాశం ఉంటుంది.

ప్రశ్న: మృతదేహాం నుంచి విడుదలయ్యే స్రావాలను తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉందని మీరంటున్నారు.. కానీ భారతీయులు అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు కొన్ని సంప్రాదాయాలు పాటిస్తారు. ఈ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉందా..?

జవాబు: అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తప్పనిసరిగా మాస్క్​ ధరించాలి. అంతేకాకుండా అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే వైరస్ బారిన పడే అవకాశం ఉండదు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే బతికున్న వ్యక్తితో పోల్చితే చనిపోయిన వారి నుంచి వైరస్ సోకటం అనేది చాలా తక్కువ.

ప్రశ్న: కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఐసీఎంఆర్​ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై ఏమంటారు..?

జవాబు: వైరస్ బారిన పడకుండా ఉండేలా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకునేందుకే ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఇచ్చింది. అనవసరంగా మృతదేహాన్ని తాకొద్దని, మాస్క్​లు ధరించటంతోపాటు చేతులను శుభ్రంగా కడుక్కోవటం వాటిపై సూచనలు ఇచ్చింది. అంతేకానీ మృతదేహంతో చాలా ప్రమాదమని నేను అనకోవటం లేదు.

ప్రశ్న: చాలా రాష్ట్రాల్లో మృతదేహాలకు కరోనా సోకిందా అనే అనుమానంతో పరీక్షలు చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరీక్షలు చేయటానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. దీనిపై మీ అభిప్రాయం..?

జవాబు: కరోనా పరీక్షలు చేయాలా? వద్దా? అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. ఇక్కడ ముఖ్య విషయమేంటంటే చనిపోయిన వ్యక్తి మృతి చెందిన తీరు, సామాజిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు చేయవచ్చు. మృతదేహానికి కరోనా పరీక్షలు చేయటంతో అంతగా లాభం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

ప్రశ్న: కరోనా వైరస్​పై సీసీఎంబీ మార్చి నెల నుంచి చాలా పరిశోధనలు చేస్తోంది. ఏమైనా కొత్త విషయాలను గుర్తించారా..?

జవాబు: ఐసీఎంఆర్ నిబంధనలకనుగుణంగా పరిశోధనలు చేస్తున్నాం. బాధితుల రక్తం, మలం వంటి నమూనాలను సేకరిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నాం. మా ఫలితాలను ఇతర పరిశోధన సంస్థలతో పంచుకుంటున్నాం. ఈ పరిశోధనలన్నీ వైరస్ స్వరూపం, ఎలా సోకుతుందనే అంశాలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. వేగంగా, తక్కువ ఖర్చులతో కరోనా టెస్టులను నిర్వహించే అంశంపై కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.

ప్రశ్న: కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు మార్కెట్​లోకి పలు కంపెనీలు ఔషధాలు విడుదల చేశారు. దీని పై మీ స్పందనేంటి..?

జవాబు: కరోనా వైరస్​కు మందు లేదనే వాతావరణంలో ఇలాంటివి రావటం మంచి పరిణామం. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే వచ్చిన మందులు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి. బాధితులు ఎంతమేరకు కోలుకుంటున్నారనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక ఉపశమనం కంటే దీర్ఘకాలికంగా ఉపయోగపడే ఔషధాలను కనుగొనే ప్రయత్నాలు చేయాలి.

ప్రశ్న: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి చెందలేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. కానీ కొన్ని పరిశోధనల్లో సామాజిక వ్యాప్తి చెందిందంటూ పలు వార్తలు బయటికొస్తున్నాయి. ఈ అంశంపై ఏవైనా సంస్థలు శాస్త్రీయంగా పరిశోధనలు జరిపాయా...?

జవాబు: టెస్టుల సంఖ్య ఆధారంగా సామాజిక వ్యాప్తిని అంచనా వేయవచ్చు. ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తే ఎలా వ్యాప్తి చెందుతోందనేది తెలుస్తోంది. సాంకేతిక లోపాల వల్ల పరీక్షలు ఎక్కువగా జరపలేకపోతున్నారు. ఒకరి నుంచి వ్యాప్తి చెందుతుందా లేక సమూహం ద్వారా విస్తరిస్తుందా అనేది తెలియటం లేదు. ఐసీఎంఆర్ అంచనాలు అత్యంత ప్రమాణాలతో కూడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల చూస్తుంటే మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. కారణం ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచితే భారీ సంఖ్యలో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకుంటే కేసులు తప్పక తగ్గే అవకాశం ఉంది. అందుకు మహారాష్ట్రంలోని ముంబయి, ధారావిలో చేపట్టిన చర్యలే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎక్కువ టెస్టులు చేయటం, క్వారంటైన్, ఐసోలేషన్ వంటి చేపడితే వైరస్​ను కట్టడి చేయవచ్చు.

ప్రశ్న: కొంత మందికి కరోనా సోకినప్పటికీ...ఆ లక్షణాలు కనిపించటం లేదు. దీనిని మనం ఎలా చూడవచ్చు..?

జవాబు: ఇదొక మంచి పరిణామమే. చాలా దేశాల్లో కరోనా సోకినా 40 శాతం వరకు లక్షణాలు కనిపించటం లేదు. కానీ భారత్​లోని ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే 60- 80 శాతం వరకు కనిపించట్లేదని తెలుస్తోంది. ముఖ్యంగా మన దేశంలో 80- 90 శాతం వరకు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. కారణం మన దేశంలో అత్యధికంగా యువత ఉండటం కలిసోచ్చే అంశం. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో వైరస్ బారి నుంచి బయటపడే అవకాశం ఉంది.

ప్రశ్న: కరోనా సోకిన వారితోపాటు నిర్ధరణ అయినా లక్షణాలు బయటపడని వారికి భవిష్యత్తులో ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉంది..?

జవాబు: ఇందుకు సంబంధించిన ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కొన్ని సంవత్సరాల తర్వాల ఊపిరితిత్తుల సమస్య వస్తుందన్న వాదన సరికాదు. శరీరంలోకి వైరస్ ప్రవేశించిన నాటి నుంచే రోగ నిరోధక శక్తితో ప్రమాదాన్ని అధిగమించవచ్చు.

మూడు సూత్రాలు పాటించండి..

'ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించండి. మాస్క్​లు ధరించటంతోపాటు భౌతికంగా దూరం పాటించాలి. ఏవైనా వస్తువులను తాకినప్పుడు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోండి. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ బారి నుంచి కాపాడుకోవడానికి ఇంతకుమించి వేరే మార్గం లేదు'- సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ కె మిశ్రా

ఇదీ చూడండి: బతుకు చక్రాలపై 'జ్యోతి' జీవన పోరాటం.. ఆదుకోవాలని విన్నపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.