ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డులు డిజిటల్ విధానంలో రానున్నాయి. ఎలక్ట్రానిక్ విధానంలో మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి ఓటరు గుర్తింపు కార్డులను పొంది ఓటు వేసేందుకు ఉపయోగించుకోవచ్చు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రేపట్నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
ఇటీవల కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారు మొదటి దశలో రేపట్నుంచి డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చు. మిగతా వారు రెండో దశలో ఎలక్ట్రానిక్ కార్డులు పొందవచ్చు. ఈసీ వద్ద మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌలభ్యం కలుగుతుంది. డిజిటల్ ఎపిక్ కార్డుల విధానం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌తో ఈటీవీభారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: 'కేటీఆర్ సీఎం అయితే మెడికల్ కాలేజీ మొదటికే '