ETV Bharat / state

ఇథోపియన్​ ఎయిర్​ కార్గో సేవలు ప్రారంభం - Ethiopian cargo Flights Hyderabad

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇథోపియన్ ఎయిర్‌లైన్స్ కార్గో సేవలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా ఆఫ్రికన్​ మార్కెట్లతో సంబంధాలు ఏర్పడనున్నాయి.

ఇథోపియన్​ ఎయిర్​ కార్గో సేవలు ప్రారంభం
ఇథోపియన్​ ఎయిర్​ కార్గో సేవలు ప్రారంభం
author img

By

Published : Apr 26, 2020, 11:49 PM IST

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆఫ్రికన్ మార్కెట్లను అనుసంధానం చేస్తూ ఇథోపియన్ ఎయిర్‌ కార్గో సేవలు ఆదివారం మొదలయ్యాయి. జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి అడిస్ అబాబా నుంచి ఇథోపియన్ విమానం (ఈటీ 3612 - అరైవల్స్ / ఈటీ 3613 - డిపార్చర్స్ ) రాత్రి 8.16 గంటల సమయంలో దిగింది. ఇది రాత్రి 11.30 గంటలకు ఇథోపియా తిరిగి వెళ్తుంది. ఈ కార్గో విమాన సర్వీసుతో హైదరాబాద్ – ఇథోపియాల మధ్య ఆఫ్రికా మార్కెట్లకు సంబంధాలు ఏర్పడ్డాయి.

వారానికి ఒకసారి నడిచే ఈ ఇథోపియన్ ఎయిర్‌లైన్స్ కార్గో విమానం 50 మెట్రిక్ టన్నుల సామర్యం కలిగిన సామగ్రిని తీసుకెళ్లగలదు. తాజాగా ఇథోపియన్ ఎయిర్‌లైన్స్ చేరికతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహిస్తున్న స్పెషల్ కార్గో విమానాల సంఖ్య 12కు చేరింది. హైదరాబాద్‌, అమెరికా, యూరోపియన్ దేశాలు, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఫార్ ఈస్ట్ దేశాలలోని వివిధ ప్రదేశాలను కలుపుతూ అత్యవసర సరుకులను కార్గో విమానాలు చేరవేస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కార్గో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానాల్లో... కాతే, టర్కిష్, లుఫ్తాన్సా, స్పైస్ ఎక్స్ ప్రెస్, బ్లూ డార్ట్​లు ఉన్నట్లు జీఎంఆర్‌ యాజమాన్యం తెలిపింది.

ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.