Etela Rajender Comments on Facilities in Assembly: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంత్రులు అడుగడుగున అడ్డుకున్నారు. బడ్జెట్‌పై కాకుండా ఇతర అంశాలపై మాట్లాడడం ఏమిటని మంత్రులు, ఎమ్మెల్యేలు నిలదీశారు. ఇవాళ బడ్జెట్‌పై చర్చించేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వగా.. ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రారంభించారు. అయితే బడ్జెట్‌పై చర్చ చేయకముందే.. తమ పార్టీకి ప్రత్యేకంగా కార్యాలయం కేటాయించాలని అసెంబ్లీ వేదికగా ఈటల స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
తాము ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినేందుకు కూడా చోటు లేదని సభలో ఈటల రాజేందర్ లేవనెత్తారు. ఇవాళ తాను టిఫిన్ తినడానికి సీఎల్పీ కార్యాలయానికి భట్టి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈటల వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి హరీశ్ రావు.. ఐదుగురు సభ్యులు ఉన్న పార్టీకే ఆఫీస్ కార్యాలయం ఇచ్చే సంప్రదాయం ఉందని స్పష్టం చేశారు. దీనికి తిరిగి స్పందించిన ఈటల రాజేందర్.. అన్ని సంప్రదాయాల ప్రకారమే జరగవని.. కొన్ని అవసరాలను బట్టి కూడా జరుగుతాయని వ్యాఖ్యానించారు.
దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని.. సౌకర్యాల గురించి ప్రస్తావించే వేదిక ఇది కాదని స్పష్టం చేశారు. బడ్జెట్ మీదనే మాట్లాడాలని ఈటల రాజేందర్‌కు సూచించారు. ఏదైనా సౌకర్యాల గురించి మాట్లాడాలంటే.. స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి మాట్లాడాలని సూచించారు. ఇచ్చిన సమయాలన్ని సద్వినియోగం చేసుకోకుండా తిరిగి నిందలు వేస్తారని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
20 సంవత్సరాల తరువాత తాను సభాసంప్రదాయాల గురించి నేర్చుకోవాలా అధ్యక్షా అన్న ఈటల.. తాను ఈ విషయమై చాలా సార్లు స్పీకరును కలిశానని అయినా ప్రయోజనం లేదని తెలిపారు. దీనిపై తిరిగి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకుని సంప్రదాయాలు తెలిసినా.. అవి పాటించాలి కదా అని వ్యంగంగా మాట్లాడారు. ఎమ్మెల్యే బాల్క్ సుమన్ కూడా ఇదే అంశాన్నితప్పుబట్టడంతో.. ఆ తరువాత ఈటల రాజేందర్ బడ్జెట్‌పై చర్చ మొదలు పెట్టారు
"బడ్జెట్ కంటే ముందు మాకు రెండు సమస్యలు ఉన్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో బీజేేపీ సభ్యులకు వసతి కల్పించట్లేదు. బీజేపీ సభ్యులకు టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినేందుకూ అవకాశం లేదు. దీనిపై మీకు చాలా విజ్ఞప్తి చేశాం. ఇది నన్ను అవమానించడం కాదు. శాసన సభ్యులను అవమానించడం. " - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: ఒక పార్టీ భారత్‌ను రెండు దేశాలుగా చీల్చుతోంది.. అసెంబ్లీలో కాంగ్రెస్, ఎంఐఎం
గ్రాండ్‌గా స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. రాజకోటలో ప్రత్యేక ఏర్పాట్లు.. ప్రముఖులు హాజరు
నిజాయితీ చాటుకున్న రిక్షావాలా.. దొరికిన రూ.25 లక్షలను పోలీసులకు ఇచ్చి..