Etela Rajender: పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు ఉండవు కానీ.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకుని దేశమంతా తిరగడానికి ఎక్కడ నుంచి వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీసి మద్యం, భూముల రిజిస్ట్రేషన్, కరెంట్, బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపారని మండిపడ్డారు. సంవత్సరానికి రూ.25 వేల కోట్ల భారం ప్రజల మీద వేశారని విమర్శించారు. ఇక్కడ పరిపాలన చేతకాక.. నేను ఏదో వెలగ బెడతానని బంగాల్, పంజాబ్, కర్ణాటక పోతానంటూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ పరిపాలించే సత్తాలేక, సమస్యలు పరిష్కరించే దమ్ము లేదు కానీ దేశం వెలగ బెడతానని పోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
తెలంగాణలో సరైన పరిపాలన అందించలేని సీఎం కేసీఆర్.. ఏం సాధించాలని దేశవ్యాప్త పర్యటనకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని తిరగడానికి వెళ్లిన సీఎంను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా లేదు.. సమస్యలు పరిష్కరించే దమ్ము లేదు కానీ దేశ రాజకీయాల్లో ఏదో ప్రభావం చూపిస్తానంటూ పోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పకపోతే తెలంగాణకి అరిష్టమని ప్రజలంతా భావిస్తున్నారని ఈటల వ్యాఖ్యానించారు.
"తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. సరైన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా బిల్లులు చెల్లించడం లేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలమీద పన్నుల భారం మోపారు. లిక్కర్ మీద రెట్లు పెంచారు. భూముల రిజిస్ట్రేషన్, కరెంటు, బస్సు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరానికి రూ.25 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు" -ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
-
సంవత్సరానికి 25 వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేశారు.
— Eatala Rajender (@Eatala_Rajender) May 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని దేశం తిరగడానికి పోయిన కేసీఆర్ ను చూసి తెలంగాణ ప్రజలు తు అని అంటున్నారు.
కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీస్తా అన్నట్లు ఉంది.#KCRFailedTelangana pic.twitter.com/1aHPb7z4em
">సంవత్సరానికి 25 వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేశారు.
— Eatala Rajender (@Eatala_Rajender) May 20, 2022
ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని దేశం తిరగడానికి పోయిన కేసీఆర్ ను చూసి తెలంగాణ ప్రజలు తు అని అంటున్నారు.
కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీస్తా అన్నట్లు ఉంది.#KCRFailedTelangana pic.twitter.com/1aHPb7z4emసంవత్సరానికి 25 వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేశారు.
— Eatala Rajender (@Eatala_Rajender) May 20, 2022
ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని దేశం తిరగడానికి పోయిన కేసీఆర్ ను చూసి తెలంగాణ ప్రజలు తు అని అంటున్నారు.
కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీస్తా అన్నట్లు ఉంది.#KCRFailedTelangana pic.twitter.com/1aHPb7z4em
ఇవీ చదవండి: