ప్రజలపై భారం పడకుండా మూత్రపిండాలు, గుండె, కాలేయం, రుమటాలజీ విభాగాల్లో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నిమ్స్‌కు వచ్చిన ప్రతి రోగికి చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులను గంటల కొద్ది వేచి చూసే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచడం కోసం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణతోపాటు... నిమ్స్‌లో ఉన్న అన్ని శాఖాధిపతులతో హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఈటల సమీక్షించారు.
70 శాతం సమస్యలు పరిష్కారం..
గుండె రంద్రాలు, చిన్న వయసులో కిడ్నీ సమస్యలు, లివర్ ఫెయిల్యూర్, బ్రెయిన్ హెమరేజ్ వీటికి చికిత్స అందించడం ద్వారా 70 శాతం సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్ పేరును మరింత ఇనుమడింప చేసేలా డాక్టర్స్ అందరూ పని చేయాలని కోరారు.పేషంట్, పేషంట్ అటెండెంట్‌కు డాక్టర్స్, కౌన్సిలర్స్ ఎప్పటికప్పుడు పేషంట్ కండిషన్ వివరించాలని సూచించారు. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాలని కోరారు. ప్రతి హాస్పిటల్లో పేషంట్ కౌన్సిలర్స్ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని మంత్రి అన్నారు.
కొవిడ్ మహమ్మారి డాక్టర్ని దేవుణ్ణి చేసింది..
రూ.7,500 కోట్ల బడ్జెట్‌తో 80 వేల సిబ్బందితో అను నిత్యం ప్రజలతో సంబంధం ఉన్న డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ అని మంత్రి వివరించారు. ఈ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన భాధ్యత మనందరిపై ఉందని మంత్రి అన్నారు. కొవిడ్ మహమ్మారి డాక్టర్‌ను దేవుణ్ణి చేసిందని... కొవిడ్ కష్ట కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ వైద్యులు పట్ల గర్వ పడుతున్నామని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: దారుణం: మూడేళ్ల చిన్నారిపై బాలుడు అత్యాచారం