ETELA JAMUNA: ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ మాసాయిపేట రెవెన్యూ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఈటల జమున, ఈటల నితిన్ హైకోర్టును ఆశ్రయించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని సర్వే నెంబరు 130లోని మూడెకరాలను సత్యనారాయణ రావు నుంచి ఈటల నితిన్ రెడ్డి కొనుగోలు చేశారని న్యాయవాది డి.ప్రకాష్ రెడ్డి వాదించారు. ఆ భూములను 1995లోనే ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిందని.. అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం తరఫున న్యాయవాది హరీందర్ కోర్టుకు తెలిపారు.
రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమేదో.. ప్రైవేట్ భూములేవో తెలియకుండా నోటీసులు ఇస్తున్నారని.. జమునా హేచరీస్‌కు ఇప్పటి వరకు 76 నోటీసులు ఇచ్చారని ప్రకాష్ రెడ్డి వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి: రేపు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని
Agnipath Scheme: ఆర్మీ, నేవీలో రిక్రూట్మెంట్ ప్రక్రియ షురూ!