హైదరాబాద్లోని మణికొండ, పుప్పాలగూడ, అల్కాపురి టౌన్షిప్ ప్రాంతాల్లోని భవన నిర్మాణ కార్మికులకు కృషి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసరాలు, భోజనాన్ని అందజేశారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 20 వేల మందికి నిత్యవసర సరకులు, భోజనం అందించినట్లు సంస్థ నిర్వాహకురాలు పటోళ్ల రూపా రెడ్డి తెలిపారు.
పేదలకు 7 వేల మాస్కులు పంపిణీ చేశామన్నారు. నిత్యం వేర్వేరు ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నామని తెలిపారు. తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు సైతం ముందంజలో ఉండి రక్తదానం చేశారని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: 'కరోనాపై పోరు సాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం'