ETV Bharat / state

జర్నలిస్టుల సేవలు మరువలేనివి : కోలేటి దామోదర్​

author img

By

Published : Apr 26, 2020, 11:39 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ ఛైర్మన్​ కోలేటి దామోదర్​ అన్నారు. ఆదివారం వాసవీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో 40 మంది జర్నలిస్టులకు ఆయన నిత్యావసరాలను అందజేశారు.

నిత్యావసరాల పంపిణీ
నిత్యావసరాల పంపిణీ

కరోనాపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ లాక్​డౌన్​ పరిస్థితుల్లో జర్నలిస్టులు చేస్తున్న సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ ఛైర్మన్​ కోలేటి దామోదర్​ అన్నారు. ఆదివారం వాసవీ సేవా కేంద్రంలో 40 మంది జర్నలిస్టులకు కోలేటి దామోదర్​ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక్కో పాత్రికేయునికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలను ఆయన అందించారు. కార్యక్రమంలో వాసవీ సేవా కేంద్రం అధ్యక్షులు రాజశేఖర్​ గుప్తాతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.