కార్మికులు, ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం పొందేందుకు కార్మిక రాజ్య బీమా కార్పొరేషన్ (employment state insurance corporation) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈఎస్‌ఐసీ ప్రత్యేకాధికారి డాక్టర్ నవీన్ సక్సేనా ఆదేశాలు జారీచేశారు. గతంలో ఈఎస్‌ఐ (employment state insurance corporation) ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో లేకపోతే.. ప్రైవేటు ఆసుపత్రులకు పంపించేవారు. ఇందుకయ్యే ఖర్చును ప్రైవేటు ఆసుపత్రులకు ఈఎస్‌ఐసీ (employment state insurance corporation) తిరిగిచెల్లించేది. కానీ కొంతకాలంగా ఈఎస్‌ఐ (employment state insurance corporation) ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల క్రితం దిల్లీ పరిధిలో ప్రైవేటు రిఫరల్స్‌ను కార్పొరేషన్ నిలిపివేసింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రుల (employment state insurance corporation)కు రిఫర్ చేయాల్సి వస్తే తప్పనిసరిగా ఈఎస్‌ఐసీ (employment state insurance corporation) కేంద్ర కార్యాలయ అనుమతి తీసుకోవాలని నిబంధన విధించారు.
అత్యవసర వైద్యానికి ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేకపోవడం, వైద్యనిపుణుల కొరత తదితర కారణాలతో కొందరు కార్మికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటుకు రిఫరల్ విధానాన్ని పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు, బీమాదారులు, ఉద్యోగ, యాజమాన్య సంఘాలు ఈఎస్‌ఐసీ (employment state insurance corporation)ని కోరాయి. దీంతో ఇందుకు కార్పొరేషన్ అనుమతిచ్చింది. రాష్ట్రంలో 100, అంతకన్నా తక్కువ పడకలున్న ఈఎస్‌ఐ (employment state insurance corporation) ఆసుపత్రుల సూపరింటెండెంట్లు నిబంధనల మేరకు ప్రైవేటు ఆసుపత్రుల నమోదుకు అనుమతి ఇవ్వాలని తెలిపింది. ప్రతి కేసును పరిశీలించి.. ఈఎస్‌ఐ ఆసుపత్రి (employment state insurance corporation)లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో లేకుంటేనే రిఫరల్‌కు అనుమతించాలని స్పష్టంచేసింది.
నిరుద్యోగ భృతి పథకం పొడిగింపు
అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన కింద ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ భృతి పథకాన్ని 2022 జూన్ 30 వరకు కేంద్ర కార్మికశాఖ పొడిగించింది. ఉద్యోగం కోల్పోయిన సమయానికి గత రెండేళ్లపాటు ఈఎస్‌ఐ (employment state insurance corporation) బీమా చందా చెల్లించి ఉండాలన్న నిబంధనను సవరించింది. ఈ కాలపరిమితిని ఏడాదికి తగ్గించింది.
ఇవీ చూడండి: