ఈఎస్ఐ స్కామ్‌పై ఏసీబీ విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిని అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. ఎనిమిది కోట్లకు పైగా మందుల కొనుగోళ్లలో ఈమె ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఈమెతో పాటు చెన్నైకి చెందిన అరవింద్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇతను మందుల సరఫరాదారుగా పనిచేస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ.... బాలానగర్‌లోని అతని కంపెనీలో సోదాలు చేశారు. పద్మ అనే అధికారితో కలిసి అరవింద్ రెడ్డి అక్రమాలు పాల్పడినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది . ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు 10 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. దర్యాప్తులో మరికొంత మందిని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి.. పాక్ టీనేజర్ హస్నేన్ ప్రపంచ రికార్డు