ఇవీ చూడండి: మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను కలిసిన కేసీఆర్
జులై 15 వరకు పూర్తి చేయాలి: ఎర్రబెల్లి
రాష్ట్రంలో ఎక్కడా నీటి సరాఫరాలో ఇబ్బందులు ఏర్పడొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. జులై 15 వరకు అన్ని రకాల పనులు పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఇంజినీర్లతో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.
జులై 15 వరకు పూర్తి చేయాలి
ఇంటింటికీ శుద్ధమైన తాగునీటిని అందించే విషయంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. జులై 15 నాటికి అన్ని రకాల పనులు పూర్తి చేయాలని... రాష్ట్రంలో ఎక్కడా నీటి సరాఫరాలో అవాంతరాలు ఉండొద్దని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఇంజినీర్లతో మంత్రి సమావేశమయ్యారు. జిల్లాలు, సెగ్మెంట్ల వారిగా పనుల పురోగతిని సమీక్షించారు. మిషన్ భగీరథతో 23 వేల 968 ఆవాసాల్లోని 55 లక్షల 59 వేల 172 ఇళ్లకు తాగునీరు సరాఫరా చేయాల్సి ఉండగా... ప్రస్తుతం 22 వేల 210 ఆవాసాల్లోని 49 లక్షల 9 వేల 72 ఇళ్లకు నల్లాతో ప్రతీరోజు తాగునీరు సరాఫరా చేస్తున్నారు. మిగిలిన 1758 ఆవాసాల్లోని నివాసాలకు కూడా త్వరలోనే నల్లాతో తాగునీటిని అందిస్తామని అధికారులు వివరించారు. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్ వాడీలకు కచ్చితంగా నీటి సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇవీ చూడండి: మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను కలిసిన కేసీఆర్
sample description
Last Updated : Jun 14, 2019, 9:27 PM IST