ETV Bharat / state

గతంలో ఉన్న టారీఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు: ఈఆర్సీ - Electricity charges latest update

2021-22 సంవత్సరానికి సంబంధించి గతంలో ఉన్న టారిఫ్​ ప్రకారమే విద్యుత్​ ఛార్జీలు కొనసాగుతాయని ఈఆర్సీ వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఛార్జీలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

Electricity charges as per previous tariff
విద్యుత్ ఛార్జీలపై స్పష్టతనిచ్చిన ఈఆర్సీ
author img

By

Published : Mar 27, 2021, 9:34 PM IST

గతంలో ఉన్న టారీఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు కొనసాగుతాయని ఈఆర్సీ వెల్లడించింది. చివరగా 2018 మార్చి 27న విద్యుత్ టారీఫ్ ఆర్డర్ ఇచ్చారని.. ఏఆర్​ఆర్​ ఆ ప్రతిపాదనలనే బహిరంగ విచారణ చేసి.. వాటినే కొనసాగిస్తుందని తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ సప్లయ్ టారీఫ్​లు, క్రాస్ సబ్సిడీ సర్​ఛార్జీలు, అడిషనల్ సర్​ఛార్జీలుగా అమలు చేస్తున్నామని పేర్కొంది.

2019-20, 2020-21, 2021-22 ఏడాదికి సంబంధించి ప్రతిపాదనలు లేకపోవడంతో వాటినే కొనసాగిస్తున్నామని ఈఆర్సీ తెలిపింది. టీఎస్-ట్రాన్స్​కోకు సంబంధించిన జనరల్ సబ్సిడీ-రూ.7,66,500, టీఎస్-ట్రాన్స్​కో ఎస్​.సి.ఎస్​.డి.ఎఫ్​.-రూ.1,78,500, టీఎస్-ట్రాన్స్​కో ఎస్​.టి.ఎస్​.డి.ఎఫ్.-రూ.1,05.000, అసిస్టెంట్ స్పిన్నింగ్ మిల్స్​కు సంబంధించి-రూ.14,500లు ఇలా అన్నీ కలుపుకుని మొత్తం రూ.10,64,500 సబ్సిడీని ప్రభుత్వం 2021-22 బడ్జెట్​లో ఆమోదించిందని ఈఆర్సీ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఛార్జీలే కొనసాగుతాయని ఈఆర్సీ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: జలమండలికి విద్యుత్ సరఫరా కట్​ చేయొద్దు : ఎస్​ఈఆర్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.