ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా పేర్కొన్నారు. ముఖ్యంగా భూమిపై పెరిగే వేడి వాతావరణాన్ని తగ్గించేందుకు తమవంతు బాధ్యతగా చెట్లను నాటాలని కోరారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. అనంతరం పర్యావరణ దినోత్సవంపై జరిగిన వ్యాసరూప పరీక్షలో నెగ్గిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ అనిల్ కుమార్, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి పీకే ఝు హాజరయ్యారు.
ఇవీ చూడండి: పర్యావరణ పరిరక్షణకై దక్షిణ మధ్య రైల్వే