ETV Bharat / state

ENGENEERING IN TELUGU: తెలుగులో బీటెక్‌.. ఈసారి లేనట్టేనా? - telangana latest news

ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 14 కళాశాలలు మాతృభాషలో బోధనకు అఖిల భారత సాంకేతిక విద్య మండలి(ఏఐసీటీఈ) నుంచి అనుమతులు తీసుకున్నాయి. అయితే.. దీనికి తెలంగాణలోని జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు ముందుకు రాలేదు. ఫలితంగా.. రాష్ట్రంలో ప్రస్తుత(2021-22) విద్యాసంవత్సరంలో తెలుగులో సాంకేతిక విద్యను బోధించే అవకాశాలు కనిపించడం లేదని స్పష్టమవుతోంది.

engineering-education-in-telugu-seems-to-be-non-existent-this-year
తెలుగులో బీటెక్‌.. ఈ సారి లేనట్టేనా?
author img

By

Published : Jul 25, 2021, 11:46 AM IST

జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా 2021-22 నుంచి ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యాబోధనను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ గత నవంబరులో ప్రకటించింది. ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సులు ప్రారంభించే విషయాన్ని ఏఐసీటీఈ.. యూనివర్సిటీల్లోని విభాగాలు, అనుబంధ కళాశాలల ఇష్టానికే వదిలేసింది. జేఎన్‌టీయూ పరిధిలోని రాష్ట్రవ్యాప్తంగా 4 వర్సిటీ కళాశాలలు, 21 అటానమస్, 233 గుర్తింపు పొందిన కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఏటా 80 నుంచి 85 వేల మంది విద్యార్థులు చేరుతుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 10 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా.. వాటిలో ప్రతి సంవత్సరం సుమారు 4,500 మంది ప్రవేశం పొందుతుంటారు.

ఈ వర్సిటీల పరిధిలోని విభాగాలు, కళాశాలలు తెలుగులో బీటెక్‌ విద్యను అందించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది విద్యార్థులకు అక్టోబరు 25వ తేదీ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. అప్పటిలోపు ఈ కళాశాలలు ఏఐసీటీఈ నుంచి అనుమతి పొంది బోధన చేపడుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది పాఠ్యాంశాలను తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా, హిందీ భాషల్లోకి అనువాదం చేసినట్లు గత నెలలో ఏఐసీటీఈ ఛైర్మన్‌ అనిల్‌ సహస్ర బుద్దే ప్రకటించారు. పలు కారణాల వల్ల రాష్ట్రంలోని కళాశాలలు 2022-23 నుంచి తెలుగులో ఇంజినీరింగ్‌ విద్యను బోధించే అవకాశముందని తెలంగాణ సాంకేతిక విద్య, ప్రొఫెషనల్‌ కళాశాలల అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి తెలిపారు.

ఇప్పటికిప్పుడు కొంత ఇబ్బందే ....

ఇప్పటికిప్పుడు తెలుగులో సాంకేతిక విద్యను అందించడం కొంత ఇబ్బందే. మాతృభాషలో బోధనపై ఆచార్యులకు తర్ఫీదు అవసరమవుతుంది. పుస్తకాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలి.- డాక్టర్‌ మంజూర్‌హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ

ప్రతిబంధకాలు అధిగమించాలి...

మాతృ భాషలో సాంకేతిక విద్యను అందించే విషయంలో ఉన్న ప్రతిబంధకాలు అధిగమించాలి. ఓయూలో తెలుగులో సాంకేతిక విద్యను అందించే దిశగా ఇప్పటివరకు ప్రయత్నాలు ప్రారంభించలేదు. ముందుగా ప్రాంతీయ భాషల్లో సాంకేతిక పదాలతో కూడిన నిఘంటువులు అందుబాటులోకి తీసుకురావాలి. - ప్రొ.ఎం.కుమార్, ప్రిన్సిపల్‌ ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల

ఇదీ చూడండి: ఈ యేడు నుంచి ప్రాంతీయ భాషల్లోనే ఇంజినీరింగ్ విద్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.