తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబంబించే... బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 16నుంచి... పండగను నిర్వహించాల్సి ఉండగా.. గురువారం పితృఅమావాస్య కావడంతో మెుదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు.
మహిళలంతా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి... ఆడి పాడారు. అధిక ఆశ్వయుజ మాసం కావడంతో... వచ్చేనెల 17 నుంచి పండగను కొనసాగించనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మహిళలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ పండుగను నిర్వహించుకున్నారు.
ఇదీ చూడండి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ