Petition on Raviprakash: టీవీ9 మాజీ డైరెక్టర్ రవిప్రకాష్ విచారణకు సహకరించడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసహనం వ్యక్తం చేసింది. రవిప్రకాష్‌పై హైకోర్టు, నాంపల్లి కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. నాలుగు సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ.. విచారణ హాజరు కావడం లేదని కోర్టులకు వివరించింది. సమన్లు ధిక్కరించినందున రవిప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును.. ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఈడీ కోరింది. ఏబీసీపీఎల్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని 2020 డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు నాలుగు సార్లు సమన్లు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.
వివిధ కారణాలు చూపుతూ ఉద్దేశపూర్వకంగా రవిప్రకాష్ విచారణకు హాజరు కావడం లేదని పిటిషన్లలో దర్యాప్తు సంస్థ పేర్కొంది. విచారణకు సహకరించాలన్న షరతును ఉల్లంఘించినందుకు గతంలో రవిప్రకాష్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో ఈడీ వాదించింది. వివరణ ఇవ్వాలని రవిప్రకాష్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది. దర్యాప్తు అధికారి జారీ చేసిన సమన్లను బేఖాతరు చేసినందున.. ఐపీసీ ప్రకారం రవిప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరింది.
ఇదీ చదవండి: