సినీతారల డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే సినీ రంగానికి చెందిన పలువురిని విచారించిన అధికారులు.. సోమవారం హీరో నవదీప్‌తో పాటు ఎఫ్-క్లబ్ మేనేజర్ హర్‌ప్రీత్‌సింగ్‌ను విచారించారు. దాదాపు 9 గంటలపాటు వారిద్దరినీ ఈడీ అధికారులు ప్రశ్నించారు. కెల్విన్ ముఠాతో నవదీప్‌కు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపైనే అనేక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. నవదీప్ చేస్తున్న వ్యాపారాలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను కూడా ముందుగానే తెప్పించి పెట్టుకున్న ఈడీ అధికారులు.. వాటి గురించి కూలంకషంగా ప్రశ్నించారు. ఎఫ్-క్లబ్ నవదీప్ ఆధ్వర్యంలోనే నడిచేదనే వాదన కూడా ఉంది.
2017లో మత్తుమందుల కేసు నమోదైన తర్వాత ఈ క్లబ్‌ను మూసివేశారు. అనేక మంది సినీ ప్రముఖులు ఈ క్లబ్లో కలిసేవారని, అక్కడ మత్తుమందుల సరఫరా జరిగేదని గతంలోనే ఆరోపణలు వినిపించాయి. ఆబ్కారీ అధికారులు జరిపిన విచారణలో ఈ అన్ని అంశాలపైనా అప్పట్లోనే నవదీప్‌ను ప్రశ్నించారు. మత్తుమందులకు చెల్లింపులు ఈ క్లబ్ ద్వారా జరిగాయన్న అనుమానాలు నివృత్తి చేసుకునే ఉద్దేశంతోనే అప్పట్లో దీనికి మేనేజర్‌గా వ్యవహరించిన హరిప్రీత్‌సింగ్‌ను ఈడీ అధికారులు పిలిపించి విచారించారు. ఇద్దరినీ కలిపి విచారించిన ఈడీ అధికారులు.. క్లబ్‌ను మూసివేయడానికి గల కారణాలనూ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నష్టాలు రావడం వల్లే దీన్ని మూసివేయాల్సి వచ్చిందని, అంతకు మించి మరేమీ లేదని ఇద్దరూ సమాధానం చెప్పినట్లు సమాచారం. అలానే కెల్విన్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, మత్తుమందుల వాడకం గురించి తమకు తెలియదని, ఆబ్కారీ విచారణలోనే ఇది బయటపడిందని నవదీప్ ఈడీ అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
రేపు ఈడీ ముందుకు ముమైత్..
అన్ని వివరాలూ నమోదు చేసుకున్న ఈడీ అధికారులు.. అవసరమైతే మరోమారు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన నవదీప్, హరిప్రీత్సింగ్లు రాత్రి 8.30 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. రేపు ఈడీ ముందు ముమైత్‌ఖాన్ హాజరవ్వాల్సి ఉంది. ముమైత్‌ఖాన్ విచారణలోనూ కెల్విన్‌ను మరోసారి ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా కెల్విన్ ఎవరికి మత్తు పదార్థాలు సరఫరా చేశారు. వారి నుంచి ఇతనికి డబ్బులు ఎలా అందాయి అనే దానిపైనే ఈడీ దృష్టి సారించింది.
సంబంధిత కథనాలు..
Tollywood Drugs Case: ముగిసిన హీరో రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్ విచారణ
Tollywood drugs case : ముగిసిన రానా విచారణ.. కెల్విన్‌తో లావాదేవీలపై ఈడీ ఆరా
TOLLYWOOD DRUGS CASE: అనుమానాస్పద లావాదేవీలపై ఆరా.. నేడు విచారణకు ఆ ఇద్దరు!