ETV Bharat / state

ఈ-కామర్స్​ ముసుగులో చైనీయుల బెట్టింగ్ యాప్​లు - ccs police

భారతదేశంలోని యువతను లక్ష్యంగా చేసుకుని ఆన్​లైన్​ బెట్టింగ్​ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాపై ఈడీ దృష్టి సారించింది. చైనా ఆన్​లైన్​ బెట్టింగ్​ యాప్​ల కేసులో ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. ఏకకాలంలో దేశంలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ-కామర్స్​ పేరుతో చైనీయులు వందలాది బెట్టింగ్ యాప్​లు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది.

enforcement directorate enquiry on china betting apps case
చైనా బెట్టింగ్​ యాప్​ల కేసులో ఈడీ దూకుడు
author img

By

Published : Aug 29, 2020, 9:10 PM IST

చైనా ఆన్​లైన్ బెట్టింగ్ యాప్​ల కేసులో ఈడీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దిల్లీ, గురుగావ్​, ముంబై, పూణేలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. కీలక ఆధారాలు సేకరించింది. నాలుగు హెచ్ఎస్​బీసీ బ్యాంకు ఖాతాల్లో 47 కోట్ల రూపాయలు స్తంభింప చేసింది. సోదాల్లో 17 హార్డ్ డిస్క్​లు, 5 ల్యాప్ టాప్​లు, ఫోన్లను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్​లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఈ-కామర్స్​ పేరుతో చైనీయులు వందలాది బెట్టింగ్ యాప్​లు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. డాకీ పే అనే ఒక్క కంపెనీనే ఒక్క ఏడాదిలోనే 1268 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. సీఏల సహకారంతో.. డమ్మీ డైరెక్టర్లతో చైనీయులు భారత్​లో వందల కంపెనీలు సృష్టించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ వెబ్​సైట్లన్నీ అమెరికా నుంచి కొనసాగుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పేటీఎం, తదితర మొబైల్ వాలెట్​ల ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరిపినట్టు ఈడీ గుర్తించింది. ఆన్​లైన్ వాలెట్ సంస్థలు, హెచ్​ఎస్​బీసీ, ఆర్వోసీల నుంచి ఈడీ సమాచారం సేకరిస్తోంది.

ఇవీ చూడండి: బ్యాంకును మోసం చేశారంటూ సర్వోమ్యాక్స్​పై సీబీఐలో కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.