ETV Bharat / state

'ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలి' - Employment Guarantee State Council meeting in Hyderabad

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన వేయి కోట్లు వెంటనే ఇవ్వాలని, ఉపాధిహామీ ప‌థ‌కాన్ని వ్యవ‌సాయానికి అనుసంధానించాల‌ని.. రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ ఐదో సమావేశం హైద‌రాబాద్ లో జ‌రిగింది.

Employment Guarantee State Council meeting
రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం
author img

By

Published : Oct 1, 2020, 6:46 PM IST

దేశంలో, ఉపాధి హామీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ సర్కార్ పనిదినాలు కల్పించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. లాక్​డౌన్​ సమయంలో 15 రోజుల్లోనే 25 లక్షల మందికి ఉపాధికి కల్పించి, రికార్డు సృష్టించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఏడాది మూడువేల కోట్ల రూపాయల పనులు రాష్ట్రంలో జరిగినట్లు వివరించారు.

హైదరాబాద్​లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షతన.. ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ ఐదో సమావేశం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన వేయి కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కౌన్సిల్ తీర్మానించింది. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, మల్లారెడ్డి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. కేసీఆర్ దిశానిర్దేశంతో వివిధ అభివృద్ధి పనులకు ఉపాధి హామిని అనుసంధానించామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఉపాధి హామీలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాకు మ‌రిన్ని నిధులు అందేలా చూడాలని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కోరారు పంచాయ‌తీరాజ్ శాఖ నుంచి గిరిజ‌న సంక్షేమ శాఖకు రావాల్సిన నిధుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా అందించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు. 12వేల అంగ‌న్ వాడీల‌కు సొంత భ‌వ‌నాలు లేవని... ఉపాధిహామీ కింద అంగ‌న్ వాడీ కేంద్రాల నిర్మాణానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్య‌వ‌సాయ రంగానికి కూడా ఉపాధిహామీని అనుసంధానిస్తే మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుందని మంత్రి మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.