సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినం పాటించటంతో పాటు ఆన్లైన్ సభ జరపాలని తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక నిర్ణయించింది. మంగళవారం ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ఆన్లైన్లో జరిగింది. దేశంలో 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 2004 సెప్టెంబర్1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ స్థానంలో చందాతో కూడిన సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పింది. నాటి నుంచి సామాజిక భద్రతకు భరోసా ఇవ్వని సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు.
సీసీఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న ఉద్యోగులు, నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని, మండల, జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఐక్యవేదిక పక్షాన వినతిపత్రాలు సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇదీ చదవండి- బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!