ETV Bharat / state

Govt Employees Protest: బదిలీల్లో పారదర్శకత లేదంటూ ఉద్యోగుల నిరసన - బదిలీల్లో పారదర్శకత లేదంటూ ఉద్యోగుల నిరసన

Govt Employees Protest: ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల బదిలీల్లో గందరగోళం సాగుతోంది. 317 జీవో, రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా పశుసంవర్థక శాఖలో బదిలీలు జరుగుతుండటంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. పారదర్శకత లోపించిన ప్రక్రియను నిలిపేయాలంటూ నినదించారు. స్థానికత ఆధారంగా న్యాయం చేయాలంటూ పశుసంవర్థక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Govt Employees Protest: బదిలీల్లో పారదర్శకత లేదంటూ ఉద్యోగుల నిరసన

author img

By

Published : Jan 8, 2022, 7:50 PM IST

Updated : Jan 8, 2022, 8:11 PM IST

Govt Employees Protest: బదిలీల్లో పారదర్శకత లేదంటూ ఉద్యోగుల నిరసన

Govt Employees Protest: వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన బదిలీల ప్రక్రియను ఉద్యోగులు, ఆయా సంఘాల నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తప్పులతడకగా బదిలీలు చేపట్టారంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. జీవో నంబర్‌ 317లో సవరణలు చేసి అమలు చేయాలంటూ కోరుతున్నారు.

ఉద్యోగుల ఆందోళన

lack of transparency in transfers: బదిలీలు, పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ...హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశుసంవర్థక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాజాగా పశుసంవర్థక శాఖలో బదిలీల అంశం గందరగోళంగా మారడంతో తమకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్, యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ సర్వీసు అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 317 జీవో, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా బదిలీలు చేపట్టారని నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే దంపతులతో పాటు ఆయా జోన్ల సిబ్బంది నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించి న్యాయం చేయాలంటూ నినదించారు. తక్షణం 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని సిబ్బంది డిమాండ్ చేశారు. స్పౌస్‌ కేటగిరి ఉద్యోగులను మల్టీ జోన్‌కు కేటాయిస్తే... భవిష్యత్‌లో అన్నీ ఇబ్బందులేనని ఆందోళన వ్యక్తం చేశారు.

సమన్వయంతో ముందుకు సాగాలి..

సాధారణంగా పశుసంవర్థక శాఖలో సహాయ సంచాలకుల పోస్టు రాష్ట్ర స్థాయి క్యాడర్ పరిధిలో ఉంటుంది. ఎందుకంటే... ఏడీ పోస్టుకు నేరుగా నియామకం ఉండదు. వెటర్నరీ అసిస్టింట్ సర్జన్ నుంచి పదోన్నతిపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమిస్తారు. అంతే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, మామునూరు తదితర ప్రాంతాల్లో పలు పరిశోధన సంస్థలు, శిక్షణ సంస్థల్లో నైపుణ్యం గల పశువైద్యులు, సహాయ సంచాలకులు మాత్రమే పనిచేయగలుగుతారు. ఏడీ పోస్టు జోనల్ పోస్టుగా పరిగణిస్తున్నందన ఎవరికి కూడా ఆ సంస్థల్లో పనిచేసే అవకాశం కలుగదు. ప్రభుత్వ శాఖల్లో బదిలీల్లో అన్యాయం జరగకుండా టీఎన్‌జీఓ, ఇతర ఉద్యోగ సంఘాలతో సమన్వయంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినా... కూడా పశుసంవర్థక శాఖలో అందుకు భిన్నంగా జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. స్వయంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించి గుర్తింపు సంఘాలను పరిగణలోకి తీసుకుని బదిలీలు పారదర్శకంగా చేయాలని ఆదేశించినా... తమ సూచనలు, విన్నపాలను స్వీకరించకపోగా... తప్పులు సరిదిద్దడానికి డైరెక్టర్ సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ ఆక్షేపించింది.

ఏడీ పోస్టును రాష్ట్ర స్థాయి క్యాడర్​లోనే ఉంచాలి..

పశుసంవర్థక శాఖ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మల్టీజోన్​-1, మల్టీజోన్​-2 అని చేశారు. సాధారణంగా పశుసంవర్థక శాఖలో సహాయ సంచాలకులు పోస్టు రాష్ట్ర స్థాయి క్యాడర్ పరిధిలో ఉంటుంది. పలు పరిశోధన సంస్థలు, శిక్షణ సంస్థల్లో నైపుణ్యం గల పశువైద్యులు, సహాయ సంచాలకులు మాత్రమే పనిచేయగలుగుతారు. ఏడీ పోస్టు జోనల్ పోస్టుగా పరిగణిస్తున్నందన ఎవరూ కూడా ఆ సంస్థల్లో పనిచేసే అవకాశం కలుగదు. అసిస్టెంట్​ డైరెక్టర్​ పోస్టును రాష్ట్ర స్థాయి క్యాడర్​లోనే ఉంచాలని డిమాండ్​ చేస్తున్నాం. సీనియార్టీ ప్రకారం కంటే లోకల్​ స్టేటస్​ ప్రకారం చేయాలని మేము కోరుకుంటున్నాం.

-డాక్టర్ బాబు బేరి, అధ్యక్షుడు, తెలంగాణ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ సర్వీసు అసోసియేషన్

అలా అయితేనే న్యాయం జరుగుతుంది..

తప్పులు జరిగాయని ఎన్నిసార్లు చెప్పినా.. ఆ తప్పులను సరిదిద్దడం లేదు. వారికి న్యాయం చేయట్లేదు. ఏడీ పోస్టును రాష్ట్ర స్థాయి క్యాడర్​కు మారిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. 317జీవోను కొంచెం సవరణ చేసి.. అందులో సీనియార్టీ అని పెట్టారు. అందులో స్థానికతను కూడా పెడితే చాలా బాగుంటుంది.

-ఆర్.దేవేందర్‌, అధ్యక్షుడు, తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్

జూనియర్లకు పెద్దపీట

పశుసంవర్థక శాఖలో సహాయ సంచాలకులు, పశు వైద్యులు, ఇతర ఉద్యోగుల బదిలీల్లో సీనియారిటీ ఆధారంగా ప్రాధాన్యత ఇస్తుండటం కూడా తప్పేనన్నది ఉద్యోగ సంఘాల వాదన. సీనియర్ పశు వైద్యులకు ప్రాధాన్యత ఇవ్వకుండా జూనియర్లకు పెద్దపీట వేస్తుండటంతో అర్హులు తీవ్ర నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పారదర్శకత పూర్తిగా లోపించడంతో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా ఓ గూడు పుఠానీలా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా నియామకాల కోసం అన్ని జోన్లలో సమ ప్రాతినిధ్యం రావాలన్న లక్ష్యం నీరుగారుతోందని నిరసిస్తున్నారు. దామాషా పద్ధతిలో బదిలీలు చేపట్టాలని నినదిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు విరుద్ధంగా సాగుతున్న దృష్ట్యా... ఆ జాబితాలు సవరించి పూర్తి పారదర్శకత తీసుకురావాలని తెలంగాణ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ సర్వీసు అసోసియేషన్ డిమాండ్ చేసింది.

ఆవుకు వినతిపత్రం అందజేసి..

తమకు న్యాయం చేయాలని పశుసంవర్థక శాఖ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో ఆవుకు వినతిపత్రం సమర్పించి పశువైద్యులు నిరసన వ్యక్తం చేశారు. జోనల్ బదిలీల్లో పారదర్శకత పాటిస్తూ స్పౌస్‌కేసులు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 8, 2022, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.