ETV Bharat / state

హైదరాబాద్ నుంచి కరోనా మందు.. వారంలో హెటిరో ద్వారా 'కొవిఫోర్' - covifor Latest News

కొవిడ్-19 చికిత్సకు సంబంధించి దేశంలోనే మొదటి జెనరిక్ ఔషధం రెమ్‌డెసివిర్​ (కొవిఫోర్) తయారీకి తమ సంస్థకు ఆమోదం లభించినట్లు ప్రముఖ మందుల తయారీ సంస్థ హెటెరో ప్రకటించింది. మరో వారం రోజుల్లో డ్రగ్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.

కొవిడ్​కు విరుగుడు
కొవిడ్​కు విరుగుడు
author img

By

Published : Jun 21, 2020, 6:22 PM IST

కొవిడ్-19 వైరస్​కు విరుగుడు మందును తయారు చేసేందుకు ప్రముఖ మందుల తయారీ సంస్థ హెటిరోకి అనుమతులు లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. పరిశోధనాత్మకంగా యాంటీవైరల్ మెడిసిన్ రెమ్‌డెసివిర్​ను తయారు చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో డ్రగ్​కు తయారీ సహా మార్కెటింగ్ అనుమతి పొందినట్లు తెలిపింది. రెమ్‌డెసివిర్ మందును హెటెరోస్ జెనరిక్ 'కోవిఫోర్' బ్రాండ్ పేరుతో విక్రయిస్తామని వివరించింది.

'సానుకూల ఫలితాలను ఇస్తుంది'

దేశంలో పెరుగుతోన్న కొవిడ్-19 కేసుల నేపథ్యంలోనే ఎన్నో పరిశోధనల అనంతరం యాంటీవైరల్ మెడిసిన్ రెమ్‌డెసివిర్​ను 'కోవిఫోర్' పేరిట తీసుకొచ్చామని హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ డాక్టర్ పార్థ సారథిరెడ్డి వెల్లడించారు. పెద్ద ఎత్తున పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో ఈ కొత్త డ్రగ్ సానుకూల ఫలితాలను ఇవ్వనుందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా విడుదల చేసిన ఈ మందు దేశవ్యాప్తంగా రోగులకు అందుబాటులో ఉంటుందని ఛైర్మన్ స్పష్టం చేశారు.

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా..

ప్రస్తుత అవసరాలను తీర్చడానికి తగినన్ని మెడిసిన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు... ప్రభుత్వంతో పాటు వైద్య రంగంతో కలిసి పయనిస్తామని ఆయన తెలిపారు. ఈ ఉత్పత్తిని ప్రధాని మోదీ "మేక్ ఇన్ ఇండియా" పిలుపులో భాగంగా దేశీయంగా తయారు చేశామన్నారు.

వైద్యుల పర్యవేక్షణలో సూదిమందు..

కొవిడ్ లక్షణాల అనుమానితులు లేదా ధ్రువీకరించిన కరోనా బాధితులకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలన్నారు. పెద్దలు, పిల్లల్లో కోవిడ్ -19 లక్షణాలు గలవారికి రెమ్‌డెసివిర్ ఔషధాన్ని (100 MG, Vial injectable) సూది మందు రూపంలో ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు సహా, ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రమే ఈ మందును సరఫరా చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఒక్కో ఇంజక్షన్ ధర సుమారు రూ.5000 నుంచి 6000 వరకు నిర్ణయించనున్నట్లు పేర్కొంది.

తక్కువ, మధ్య ఆదాయం గల దేశాల్లో కొవిడ్ -19 చికిత్సకు మందును విస్తరించడానికి గిలియడ్ సైన్సెస్‌తో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్నామని వివరించారు.

ఇవీ చూడండి : మధ్యాహ్న భోజనంలో రాగి జావ.. మొలకలు.. బెల్లం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.