హైదరాబాద్ దీక్ష మోడల్ హైస్కూల్ ఆధ్వర్యంలో.. జీహెచ్ఎంసీ సిబ్బందికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని దీక్ష మోడల్ స్కూల్ ఛైర్మన్ నరసింహా రెడ్డి అన్నారు.
విపత్కర సమయంలో దాతలు పేద ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా.. ప్రజలు భౌతిక దూరం, మాస్క్‌లను ధరించాలని కోరారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం