శ్రీకాకుళం జిల్లా నాగావళి నది తీరంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. గ్రామ శివార్లలోని పంట పొలాల్లో వీరంగం చేస్తున్నాయి. నాగావళి నది తీరం దాటిన ఆరు ఏనుగులు వీరఘట్టం, కంబర పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతూ కనిపించాయి. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు..వాటిని అడవిలోకి పంపేందుకు బాణాసంచాలు కాలుస్తూ...శబ్దాలు చేస్తున్నారు. స్థానికుల సహాయంతో తరుముతున్నారు.
ఇవీ చదవండి...గ్రామాల్లోకి నాగావళి వరద.. నీట మునిగిన 15 ఇళ్లు