ETV Bharat / state

Electronic sales in festive season: ఎలక్ట్రానిక్​ ఉపకరణాల జోరు.. రెండింతలు పెరిగిన అమ్మకాలు - electronic sales are increasing in festival season

దసరా పండుగ సీజన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల(Electronic sales in festive season) కొనుగోళ్లను అమాంతం పెంచేసింది. నిన్నమొన్నటి వరకు కరోనా కారణంగా వినియోగదారులు లేక విలవిలలాడిన రిటైల్ షాపులు.. పండుగ తీసుకొస్తున్న కస్టమర్లతో కళకళలాడాయి. సుదీర్ఘ కాలం తర్వాత ఒక ఫెస్టివ్ సీజన్ రావటంతో.. గతేడాది దసరాతో పోలిస్తే ఈసారి రెట్టింపు అమ్మకాలు జరుగుతున్నట్లు రిటైలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆన్​లైన్ కొనుగోళ్ల పోటీని తట్టుకొని నిలదొక్కుకునేందుకు రిటైలర్లు సైతం ప్రత్యేకమైన ఆఫర్లను అందజేస్తూ దూసుకెళ్తున్నారు.

electronic sales
ఎలక్ట్రానిక్స్​ అమ్మకాలు
author img

By

Published : Oct 17, 2021, 5:06 PM IST

Updated : Oct 17, 2021, 8:11 PM IST

పండుగ సీజన్ వచ్చిందంటే ఆటోమొబైల్స్​తో పాటు.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు(Electronic sales in festive season), గ్యాడ్జెట్ల కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాళ్లు, రిటైలర్లు సైతం ఆకర్షణీయమైన ఆఫర్లతో సేల్స్ పెంచుకునేందుకు తాపత్రయపడుతుంటారు. ఈ దసరా పండుగ సీజన్ అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు రెండు వర్గాలను ఖుష్​ చేసింది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు అమ్మాకాలతో ఒకవైపు రిటైలర్లు, ఆకర్షణీయమైన(Electronic sales in festive season) రాయితీలు, క్యాష్ బ్యాక్​లతో కొనుగోలుదారులు ఇరువురు లబ్ధి పొందేలా చేసి.. ఎలక్ట్రానిక్స్ సేల్స్​ను అమాంతం పెంచేశాయి.

మినీ థియేటర్లపై మోజు

గతేడాదితో పోలిస్తే డబుల్ అమ్మకాలు(Electronic sales in festive season) జరిగినట్లు బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ మేనేజర్ ముత్యం కుమార్ తెలిపారు. దసరా, దివాళీ పండుగ సీజన్లలో టీవీలు, సెల్ ఫోన్​లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. వినోదానికి కేరాఫ్ అయిన సినిమా క్రమంగా ఓటీటీలకు మళ్లుతుండటంతో ఇంట్లో మినీ థియేటర్ ఏర్పాటుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఐపీఎల్, వరల్డ్ కప్ సీజన్లు పెద్ద టీవీలకు డిమాండ్ మరింత పెంచాయి. 55, 65, 75, 85 ఇంచుల టీవీలకు డిమాండ్ ఎక్కువ ఉందని రిటైలర్లు పేర్కొన్నారు. కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్లు మార్కెట్లో ప్రస్తుతం 4కె తో పాటు.. 8కె టెక్నాలజీ రిజల్యూషన్​లో టీవీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

రెండింతలు పెరిగిన ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల అమ్మకాలు

కలిసొచ్చిన వర్క్​ ఫ్రం హోం

టీవీలతో పాటు సౌండ్ బాక్స్​లకు అంతే డిమాండ్​ ఉందని.. వాటినీ ఎక్కువగా కొంటున్నారని రిటైలర్లు(Electronic sales in festive season) తెలిపారు. చాలా మంది ఇంకా ఇంటి నుంచే పని చేస్తుండటంతో డిష్ వాషర్లకూ ఆదరణ పెరుగుతోందని వివరించారు.

రిటైల్ దుకాణాల్లో ఆన్​లైన్ మాదిరిగానే ఫైనాన్స్ కంపెనీలు సరసమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. రూ. 25 వేల వరకు క్యాష్ బ్యాక్​లు అందజేస్తున్నాం. ఆన్​లైన్ కన్నా మెరుగైన ధరలు, ఉత్పత్తులను స్టోర్లలో అందిస్తున్నాం. -ముత్యం కుమార్​, ఎలక్ట్రానిక్​ స్టోర్​ మేనేజర్​

టీవీల తర్వాత సెల్​ఫోన్ గ్యాడ్జెట్లు, ఫోన్ యాక్సెసరీస్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రీమియం ఫోన్ల కన్నా.. మిడ్ రేంజ్ ఫోన్లకు డిమాండ్ ఎక్కువ ఉందని రిటైలర్లు చెబుతున్నారు. రూ. 40 వేల లోపు ఫోన్లు ఎక్కువ అమ్ముడవుతున్నాయని.. పండుగ వేళ ఫ్యామిలీతో సహా షాపింగ్ చేస్తున్నారని హ్యాపీ మొబైల్స్ స్టోర్ మేనేజర్ సమీర్ అంటున్నారు.

కరోనా మహమ్మారి ఆంక్షల తర్వాత వచ్చిన దసరా ఫెస్టివ్ సీజన్ మాకు రెండింతల వ్యాపారాన్ని తీసుకువచ్చింది. ఆన్​లైన్ పోటీని తట్టుకుంటూ ఆఫ్​లైన్ కస్టమర్లను ఆకర్షించేలా డిజటల్​, నగదు రెండింటిలోనూ క్యాష్​బ్యాక్, రాయితీలు అందజేస్తూ ప్రతి కొనుగోలుపై తప్పనిసరి గిఫ్ట్​లు అందజేస్తున్నాం. దసరా, దివాళీ.. పండుగల దృష్ట్యా ఈ అమ్మకాల జోరు నవంబరు 15 వరకు ఉంటుంది. ఆఫర్లు అప్పటివరకు కొనసాగిస్తాం.

-మహమ్మద్ సమీర్, స్టోర్ మేనేజర్

దివాళీ వరకు ఆఫర్లు

పండుగ సందర్భంగా నగరవాసులు సైతం ఇంటికి కొత్త వస్తువులు తీసుకువచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో చాలాకాలం తర్వాత ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు కొవిడ్ ముందు దశ సేల్స్​ను నమోదు చేశాయని రిటైలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దసారాతో మొదలైన ఈ జోరు దివాళీ వరకు కొనసాగుతుందని.. తమ ఆఫర్లు సైతం నవంబరు 15 వరకు కొనసాగుతాయని రిటైలర్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Telangana Minister Harish Rao : 'రైతులపై కారెక్కించే భాజపాకు మీరు ఓటేస్తారా?'

Last Updated : Oct 17, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.