ETV Bharat / state

విద్యుత్​ శాఖలో కరోనా కలవరం.. ఆందోళనలో ఉద్యోగులు! - విద్యుత్​ శాఖ

విద్యుత్ శాఖ ఉద్యోగుల‌ను క‌రోనా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఎస్పీడీసీఎల్ ప‌రిధిలో పూర్తిస్థాయి ఉద్యోగులు 9వేల 500 మంది, ఆర్టీజ‌న్ ఉద్యోగులు 10వేల 200 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్టు, ప్రైవేట్​ మీటర్​ రీడర్లు విధుల్లోకి రాకపోవడం వల్ల ఆర్టీజ‌న్​లు ఫీల్డ్​లోకి వెళ్లక తప్పడం లేదు. ఈ కారణంగా ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నట్టు విద్యుత్​ శాఖ అధికారులు వెల్లడించారు.

Electricity Employees Scared by Corona virus
విద్యుత్​ శాఖలో కరోనా కలవరం.. ఆందోళనలో ఉద్యోగులు!
author img

By

Published : Aug 3, 2020, 6:18 PM IST

విద్యుత్​ శాఖ ఉద్యోగులను కరోనా అందోళనకు గురి చేస్తున్నది. విధుల్లో ఉన్న 19,700 మంది ఉద్యోగుల్లో కొంతమంది ఇంటింటికీ తిరిగి మీటర్​ రీడింగ్​ తీయాల్సి వస్తుంది. ప్రైవేట్​, కాంట్రాక్ట్​ మీటర్​ రీడర్లు కరోనా నేపథ్యంలో విధులు నిర్వహించడానికి రాకపోవడం వల్ల ఆర్టీజన్​ ఉద్యోగులు ఫీల్డ్​కి వెళ్లక తప్పడం లేదు. ఈ కారణంగా ఇప్పటికే గ్రేట‌ర్ ప‌రిధిలో పలువురు ఉద్యోగులకు కరోనా సోకగా.. కొంతమంది ఉన్నత స్థాయి విద్యుత్ శాఖ అధికారులకు కూడా పాజిటివ్​ వచ్చింది.

గ్రేట‌ర్ ప‌రిధిలోని సుమారు 50ల‌క్షల మంది విద్యుత్​ వినియోగ‌దారులు, కాంట్రాక్ట‌ర్లు విద్యుత్ శాఖ అధికారుల‌ను క‌లిసేందుకు విద్యుత్​ శాఖ కార్యాలయాలకు వ‌స్తుంటారు. వారి వల్లనే అధికారులకు కరోనా సోకినట్టు విద్యుత్​ శాఖ అభిప్రాయపడుతున్నది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్పీడీసీఎల్ ప‌రిధిలో 198 మంది విద్యుత్ సిబ్బంది క‌రోనా పాజిటివ్ బారినప‌డ్డారు. వీరిలో 41 మంది క‌రోనాను జ‌యించారు. ఎస్పీడిసిఎల్ పరిధిలో పనిచేసే సిబ్బందిలోనే ఎక్కువ మందికి కొవిడ్​ సోకడం వల్ల మిగతా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే విద్యుత్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, అయినా.. కరోనా వ్యాపిస్తుందని ఎస్పీడిసిఎల్ సీఎండి రఘుమారెడ్డి తెలిపారు. విధినిర్వహణలో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సింగరేణి మాదిరిగా... కరోనా లక్షణాలు ఉన్న సిబ్బందికి 14 రోజుల పెయిడ్ లీవ్ ఇవ్వాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు అభిప్రాయపడ్డారు. దీనివల్ల కరోనాను కొంతవరకు కట్టడిచేసే అవకాశముంటుందని ఆయన అన్నారు. అన్ని విద్యుత్ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కానీ వాటిని అమలుచేయడంలో లోపం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.