ETV Bharat / state

'రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కరెంటుకు డిమాండ్‌'

Transco CMD Prabhakar Rao: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కరెంటుకు డిమాండ్‌ పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్‌ (పీక్‌ డిమాండ్‌)ను అధిగమించామని ట్రాన్స్‌ కో, జెన్‌ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్​కు మరింత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

author img

By

Published : Mar 26, 2022, 6:54 PM IST

'రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కరెంటుకు డిమాండ్‌'
'రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కరెంటుకు డిమాండ్‌'

Transco CMD Prabhakar Rao: రాష్ట్రంలో అత్యధిక విద్యుత్‌ అత్యధిక విద్యుత్‌ (పీక్‌ డిమాండ్‌)ను అధిగమించామని ట్రాన్స్‌ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్‌కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని సీఎండీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు ఏకంగా 13,742 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధిక డిమాండ్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సంవత్సరం 14,500మెగా వాట్స్‌ డిమాండ్‌ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో సైతం భారీగా విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. గతేడాది గ్రేటర్‌లో 55మిలియన్ యూనిట్స్‌ దాటని విద్యుత్‌.. ఈ సారి మార్చిలోనే 65మిలియన్ యూనిట్స్‌ డిమాండ్ పెరిగిందని ప్రభాకర్ రావు వివరించారు.

ఇదే మెుదటిసారి..

రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు 13,742 మెగా వాట్స్ డిమాండ్ నమోదైంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత డిమాండ్ ఇదే మెుదటిసారి. గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. -ప్రభాకర్‌రావు, ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.