ETV Bharat / state

మీరు తొలిసారి ఓటు వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

Elections Vote Process in Telugu : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవటానికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు ఓటరు ఏం చేయాలి..? పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాక అనుసరించాల్సిన విధానమేంటి..? పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం మీకోసం.

telangana assembly elections
Elections Vote Process in Telugu
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 9:53 PM IST

మీరు తొలిసారి ఓటు వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

Elections Vote Process in Telugu : ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటరు జాబితాలో ఓటరు తన పేరు కలిగి ఉండాలి. లేనిపక్షంలో ఓటేసేందుకు అనర్హులవుతారు. అందుకే ముందుగా తన ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉందో తెలుసుకోవాలి. ఇందుకోసం సంబంధిత బీఎల్‌వో(బూత్‌ లెవెల్ ఆఫీసర్)లు ఇచ్చే పోల్‌ చీటీల వెనుక క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే పోలింగ్‌ కేంద్రం తెలుస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి. పోలింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థుల గుర్తులు, కండువాలు, వస్త్రాలు ధరించకూడదు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అధికారులు అనుమతించరు. సాధారణ ఓటరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లటమే కాకుండా భద్రత సిబ్బందికి సహకరించాలి. ఓటు హక్కు వినియోగించుకునే వారికి పోల్‌ చీటీ ఒక్కటే ప్రామాణికం కాదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 16 ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్తేనే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు.

Smallest Polling Booth : 3 ఇళ్లు.. 5 ఓట్లు.. అతి చిన్న పోలింగ్​ బూత్.. ఎక్కడో తెలుసా?

ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవటం మొదలైనప్పటి నుంచి ఓటు సరిగ్గానే నమోదవుతుందా అనే సందేహం ఓటర్లకు కలుగుతోంది. అందుకే ఎన్నికల సంఘం ఈ సమస్యకు వీవీ ప్యాట్‌ యంత్రం ద్వారా పరిష్కారం చూపింది. ఓటరు తన ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత ఏ గుర్తుపై ఓటేశారో ఏడు సెకన్ల పాటు వీవీ ప్యాట్‌ మిషన్‌ తెరపై ఆ గుర్తు కనిపిస్తుంది. దాని ఆధారంగా ఓటు నిర్ధారించుకోవచ్చు. ఓటేసిన గుర్తు.. తెరపై కనిపించే గుర్తు సరిపోలితేనే ఓటు పారదర్శకంగా పడినట్లు లెక్క. లేనిపక్షంలో ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

How to Register to Vote Telangana : ఓటు హక్కే మీ వజ్రాయుధం.. ఈ హక్కును వదులుకోవద్దు

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారి, అదనపు ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు ఇతర పోలింగ్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తారు. ఓటర్లు వీరికి సహకరించి ఓటు హక్కు వినియోగించుకోవాలి. తొలుత ఏపీవో.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వ్యక్తి పేరు సంబంధిత పోలింగ్‌ కేంద్రం ఓటరు జాబితాలో ఉంటే ఓటరు గుర్తింపు, క్రమ సంఖ్య, పేరు గట్టిగా చదివి వినిపిస్తారు. అభ్యర్థుల ఏజెంట్లు సరేనని ఒప్పుకొంటే ఒకసారి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలును చెక్‌ చేస్తారు. అనంతరం ఓటరుకు సిరా వేయటం, రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయటం, ఓటరు స్లిప్‌ రాయటం చేస్తారు. వీటి తర్వాత ఓటరు.. పోల్‌ చీటీ తీసుకుని కంట్రోల్‌ యూనిట్‌లో బటన్‌ నొక్కి ఓటేసే అవకాశం కల్పిస్తారు. ఓటరు.. కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఓటు వినియోగించుకుని బయటకు వస్తారు. ఇలా ఓటింగ్‌ ప్రక్రియ సాగుతుంది. ఈ క్రమంలో ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే సంబంధిత ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధానాన్ని ప్రిసైడింగ్‌ అధికారి పర్యవేక్షిస్తూ రెండు గంటలకోసారి నమోదైన పోలింగ్‌ శాతాన్ని సెక్టోరియల్‌ అధికారులకు చేరవేస్తారు.

పోస్టల్ బ్యాలెట్​ అంశంలో గందరగోళం - ఓటు హక్కు దూరం చేస్తారని ఉద్యోగుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.