ETV Bharat / state

తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌పై ఈసీ స్క్వాడ్ అభ్యంతరం

Election Squad Objection Telangana Deeksha Divas in Hyderabad : తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌పై.. ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించరాదని బీఆర్ఎస్ నేతలను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉందని ఈసీ అధికారులు వారికి వివరించారు.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 1:27 PM IST

Updated : Nov 29, 2023, 2:23 PM IST

Election Squad Objection Telangana Deeksha Divas in Hyderabad : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో.. దీక్షా దివస్‌పై ఎన్నికల స్క్వాడ్ (Telangana Election squad) అభ్యంతరం తెలిపింది. ప్రచారం గడువు ముగిసినందున.. దీనిపై ఈసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉందని చెప్పారు. అయితే దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్‌ నేతలు.. అధికారులకు తెలిపారు.

నిఘా నీడలో తెలంగాణ - శాసనసభ పోలింగ్​కు పకడ్బందీ గస్తీ

Telangana Assembly Elections 2023 : ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం అధికారులు.. తెలంగాణ భవన్ బయట, ఆవరణలో కార్యక్రమాలు చేయొద్దని.. బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. అయితే లోపల రక్తదాన శిబిరం నిర్వహిస్తామని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఈసీ స్క్వాడ్ అంగీకారం తెలిపింది. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.

Telangana Deeksha Divas 2023 : మరోవైపు అమర వీరుల సాక్షిగా సాధించుకున్న రాష్ట్రాన్ని కాపాడుకుందామని.. బీఆర్ఎస్‌ నేతలు పిలుపునిచ్చారు. దీక్షా దివస్‌ను (Telangana Deeksha Divas 2023) పురస్కరించుకుని.. హైదరాబాద్ నాంపల్లి గన్‌పార్కు వద్ద ఆ పార్టీ నాయకులు, శ్రేణులు నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. అమర వీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆనాడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అణచివేత, అపహాస్యం చేస్తున్న సమయంలో.. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో.. సిద్దిపేట గడ్డపై గాంధీ తరహాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేశారు.

కేసీఆర్‌ను (CM KCR) అరెస్ట్ చేసి ఖమ్మం పంపిస్తే.. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఉస్మానియా సహా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు వెంట నడిచారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ సర్కార్.. వ్యవసాయం, విద్యుత్, నీటి పారుదల రంగాల్లో అగ్రగామిగా నిలిపిందని అన్నారు. ఈ రోజు పవిత్రమైనదని.. ఆనాటి పోరాటాన్ని, త్యాగాన్ని అర్థం చేసుకోవాలని ప్రజలకు దాసోజు శ్రవణ్‌కుమార్ సూచించారు.

ఓటరు మహాశయా మేలుకో - ఇకనైనా బద్ధకాన్ని వీడి పోలింగ్ కేంద్రానికి పోటెత్తు

రాష్ట్రంపై దాడి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని.. దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. వాటిని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ.. గద్దలు, నక్కలు, దొంగల పాలు కావద్దని... కాపాడుకునేది మనమేనని ఆయన స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్‌ ఉజ్వలంగా బాగుండాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.

అంతకుముందు శాసనసభ ఎన్నికల దృష్ట్యా.. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున.. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నేతలకు.. పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో తమకు అనుమతి ఉందని వారు.. పోలీసులు లేఖ చూపించారు. అనంతరం దీక్షా దివస్ ముగించి గులాబీ నాయకులు, శ్రేణులు వెళ్లిపోవడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక కోరిన కేంద్ర ఎన్నికల సంఘం

'నియమాలు ఉల్లంఘించారు' - రైతుబంధుకు సీఈసీ అనుమతి ఉపసంహణ

Last Updated : Nov 29, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.