Election Fight between Friends in Hyderabad : నిన్న మొన్నటి వరకూ వారిరువురూ ఒకే పార్టీలో నాయకులు. కట్ చేస్తే.. ఒకరు పార్టీ మారారు. ప్రత్యర్థి పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి ధీమాగా ప్రచారం చేసుకుంటున్నారు. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న వారు.. నేడు ప్రత్యర్థులుగా మారి తలపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇది.
ఆసక్తికరంగా మారిన అసెంబ్లీ పోరు - ఆధిపత్య పోరులో పాత ప్రత్యర్థుల హోరాహోరీ
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంత పార్టీ నుంచి అవకాశం లభించకపోవడంతో పలువురు పార్టీ మారారు. అధికార పీఠమెక్కాలనే ఆశతో.. నిన్నటి వరకు దూషించిన పార్టీల సరసన చేరి.. స్నేహంగా(Friendship) మెలిగిన వారిపై విమర్శనాస్త్రాలు సంధించుకునే పరిస్థితికి ఎగబాకారు. ముఖ్యంగా శివారు నియోజకవర్గాలు చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లిల్లో ఈ పరిస్థితి నెలకొంది.
Telangana Election Campaign : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మొన్నటి వరకూ అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. తాను ఆశించిన టిక్కెట్ రాలేదన్న కారణంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న కె.ఎస్.రత్నం.. నెలరోజుల క్రితం వరకూ గులాబీ పార్టీలో ఉండేవారు. సిట్టింగ్ ఎమ్మెల్యే(Sitting MLA) కాలె యాదయ్యతో పొసగకపోయినా పార్టీలోనే కొనసాగారు.
ప్రచారంలో జోరు మీద ఉన్న ప్రధాన పార్టీలు - ఓట్ల వేటలో బిజీగా ఉన్న అభ్యర్థులు
యాదయ్యను ఓడించాలన్న లక్ష్యంతో ఆయన గత ఎన్నికల్లోనూ పార్టీ మారారు. కల్వకుర్తి శాసనసభ సభ్యుడు జైపాల్ యాదవ్‌కు స్నేహితుడైన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గత ఎన్నికల్లో జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా నిలిచి.. ప్రచారం చేశారు. ఈసారి కసిరెడ్డి భారత రాష్ట్ర సమితి(BRS Party) నుంచి టిక్కెట్ ఆశించారు. టిక్కెట్ దక్కకపోవడంతో కసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని.. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఖైరతాబాద్.. ఉప్పల్‌లోనూ మార్పులు చేర్పులు..
Telangana Assembly Elections 2023 : ఖైరతాబాద్ అధికార పార్టీ నుంచి కార్పొరేటర్ విజయారెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో సఖ్యతగానే ఉండేవారు. వచ్చే ఎన్నికల్లో దానంకే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారన్న సమాచారంతో.. ఆమె కొద్ది నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. టిక్కెట్ దక్కించుకుని ప్రస్తుతం దానంతో హేమాహేమీగా తలపడుతున్నారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కొద్దిరోజుల వరకూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా(Active) వ్యవహరించారు. కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్‌రెడ్డితో ఉప్పూ నిప్పులా ఉన్నా.. పార్టీ కార్యక్రమాల్లో కలిసే వారు. తాజాగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ప్రచారాల్లో సైతం నువ్వా నేనా అన్నట్టు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈసారి ప్రజలు మోసపోతే - పదేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది : సీఎం కేసీఆర్
ఒకే కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదు - ఈసారి ప్రజా సర్కారు రావడం ఖాయం : రాహుల్ గాంధీ