ETV Bharat / state

ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోవడమంటే ఏంటో తెలుసా? ఎన్ని ఓట్లు వస్తే సేఫ్​?

Election Deposit Rules in India : 'మన నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్​ కూడా రాలేదంట రా'.. అని ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక సాధారణంగా ప్రజలు మాట్లాడుకునేటప్పుడు అనే మాటలు ఇవి. ఇంతకీ డిపాజిట్ గల్లంతు అంటే ఏంటి..? ఎన్ని ఓట్లు వేస్తే డిపాజిట్ డబ్బు తిరిగి వస్తుంది..? అసలు ఈ డిపాజిట్ కూడా దక్కలేదు అనే మాటకు అర్థం ఏంటి..?

Minimum Votes Required to Save Security Deposi
Losing Deposit in Election Meaning
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 5:55 AM IST

Election Deposit Rule in India : 'మన నియెజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్​ కూడా రాలేదంట రా'.. అని ఎన్నికలు అయిన తర్వాత యువత, మధ్యవయస్కులు ఎక్కువగా చర్చించుకునే అంశం. నామినేషన్లు వేసినప్పుడు అభ్యర్ధులు కొంత నగదును చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఈ డబ్బును ఎన్నికల ఫలితాలు విడదల అనంతరం అభ్యర్థులకు తమ ధరావతు డబ్బులు తిరిగి వస్తే అది గౌరవప్రదమైన ఓటమిగా లెక్కిస్తారు. అదే ఆ డబ్బులు తిరిగి రాకపోతే అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయాడని భావిస్తారు.

Telangana Election 2023 Notification Today : రాష్ట్రంలోని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 1821 మంది పోటీ చేశారు. అందులో 1569 మంది అభ్యర్థులు తమ డిపాజిట్​ని కోల్పోయారు. 252 మంది ధరావతును తిరిగి పొందారు. ఇవాళ్టి నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం(Nomination Process in Telangana) అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో నామపత్రాలు దాఖలు చేనినప్పటి నుంచి అభ్యర్దుల వ్యక్తిగత వివరాల పరిశీలన, ఈవీఎంలపై గుర్తుల కేటాయింపు, సర్వీస్‌ ఓటర్లకు బ్యాలెట్‌ పేపర్లపై గుర్తులను ముద్రించడం.. తదితర విషయాలపై అధికారులు దృష్టి పెడతారు.

అభ్యర్థికి సంబంధించిన ప్రచార ఖర్చులు, ప్రతి కదలికపై ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక బృందాలు(Election Commission Special Force) నిశిత పరిశీలన చేస్తాయి. అభ్యర్ధులు ఏదో సరదాకి పోటీ చేస్తే.. ఎన్నికల సంఘానికి అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. దీంతో పాటు అధికారులు విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్థులు నుంచి షరతులతో కూడిన సెక్యూరిటీ డిపాజిట్లను స్వీకరిస్తోంది.

నేడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణకు భారీ ఏర్పాట్లు

Losing Deposit in Election Meaning : ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికలకు రూ.10 వేలు ధరావతు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం రూ.5 వేలు సరిపోతుంది. ఈ మొత్తాన్ని నామపత్రం దాఖలు చేసే సమయంలో ఆర్ఓ దగ్గర డిపాజిట్​ చేయాలి. ఈ మొత్తాన్ని ఆర్​ఓ ఖజానా శాఖలో తెరచిన ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు(16 శాతం) ఓట్లను పొందాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఓ నియోజక వర్గంలో 1000 ఓట్లు వేశారనుకుంటే 160 ఓట్లు కంటే ఎక్కువగా సాధించాల్సిన అవసరం ఉంటుంది. 16 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే డిపాజిట్​గా చెల్లించిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు. లేనిపక్షంలో ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది.

Adilabad Losing Deposit Candidates Details : రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని నియోజకవర్గాల వివరాలును పరిశీలించగా.. 2014లో 107 అభ్యర్ధులు పోటీ చేయగా..80 మంది డిపాజిట్ కోల్పోయారు. 2018లో 123 పోటీ చేస్తే.. 100 మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు.

ఉమ్మడి ఆదిలాాబాద్​ జిల్లాలో డిపాజిట్లు కోల్పోయిన సీట్ల వివరాలు :

నియోజకవర్గం 2014లో 2018లో
పోటీ చేసిన అభ్యర్దులు డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్ధులుపోటీ చేసిన అభ్యర్దులుడిపాజిట్లు కోల్పోయిన అభ్యర్ధులు
సిర్పూరు11081210
చెన్నూరు15131412
బెల్లంపల్లి21191311
మంచిర్యాల13112119
ఆసిఫాబాద్08051008
ఖానాపూర్​06031210
ఆదిలాాబాద్​15121411
బోథ్05020704
నిర్మల్​07040806
ముథోల్​06031209

స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా డిపాజిట్లను కోల్పోవడం సర్వసాధారణం. అయితే గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కోల్పోయారు.

అభ్యర్థుల నేరచరిత్రను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్న పార్టీలు

రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ షురూ కేంద్రాల వద్ద 144 సెక్షన్​ అమలు

'ప్రలోభాలకు లొంగం, భవిష్యత్​ను ఆగం చేసుకోం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.