ETV Bharat / state

Telangana Elections 2023 : ఈ నెల 21న హైదరాబాద్​కు ఈసీ బృందం.. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష - రాష్ట్ర అధికారులో వికాస్​ రాజ్ దృశ్యమాధ్యమ సమీక్ష

Elections in Telangana update : రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు.. ఈనెల 21న కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధి బృందం హైదరాబాద్​కు రానుంది. ఈ క్రమంలో మూడు రోజులు పాటు వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈరోజు వికాస్‌ రాజ్‌ కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

Election Commission
Election Commission
author img

By

Published : Jun 14, 2023, 8:53 PM IST

EC Team will Review Election Preparations in Telangana : రాష్ట్ర శాసనసభ ఎన్నికల సన్నాహకాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం వచ్చే వారం సమీక్షించనుంది. ఇందుకోసం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఈసీ అధికారుల బృందం.. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్​లో పర్యటించనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ ​రాజ్, స్పెషల్ పోలీస్ నోడల్ అధికారి, కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారితో సమావేశం కానుంది.

ఇందులో భాగంగా ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం సమీక్ష నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణ, భద్రత సంబంధిత అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆదాయపన్ను శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎక్సైజ్, జీఎస్టీ, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్, డీఆర్ఐ, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రతినిధులతో మూడు రోజుల పాటు ఈసీ బృందం సమావేశం కానుంది.

Telangana Assembly Elections 2023 : ఎన్నికల నిర్వహణా ప్రక్రియలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయం, సంబంధిత అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ఈసీ బృందం పర్యటన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈరోజు సీఈఓ వికాస్​ రాజ్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్​తో పాటు పోలీసు అధికారులు, సీఈఓ కార్యాలయం అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికల సన్నాహకాలు, ఓటర్ల జాబితా సవరణ, అధికారులకు శిక్షణ, జిల్లా ఎన్నికల నిర్వహణ, బందోబస్తు ప్రణాళికలపై చర్చించారు. ఎన్నికలు సాఫీగా, ప్రశాంతంగా జరగడంలో పోలీసు అధికారుల పాత్రను డీజీపీ అంజనీకుమార్ వివరించారు. తగినంత సిబ్బందిని వినియోగించాలని.. ఐటీ, జీఎస్టీ శాఖల సమన్వయంతో సరిహద్దు చెక్ పోస్టుల ఏర్పాటు, అంశాలపై దృష్టి సారించాలని డీజీపీ సూచించారు.

TS Assembly Elections 2023 : 'ఈ దఫా ఎన్నికల్లో అన్నీ కొత్త ఈవీఎంలే'

Telangana Assembly Elections : మరోవైపు ఈ ఏడాది చివరన జరిగే శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహకాలు చేపట్టింది. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు శిక్షణ సహా.. ఇతరత్రా కార్యక్రమాలను ప్రారంభించింది. ఎన్నికల కోసం అక్టోబర్ గడువుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. బీఎల్‌వో ద్వారా ఇంటింటి పరిశీలన కొనసాగుతోంది. నకిలీ, మల్టిపుల్ ఎంట్రీ ఉన్న ఓటర్ల వడపోత సాగుతోంది. మరోవైపు ఈవీఎంల తొలిదశ పరిశీలనా ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. శాసనసభ ఎన్నికల దృష్ట్యా.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి పోస్టింగులు ఉండేలా చూస్తోంది. ఇందులో భాగంగా పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో పాటు ఇతర అధికారుల బదిలీలు జరగనున్నాయి.

ఇవీ చదవండి : శాసనసభ ఎన్నికల కోసం నేడు ఓటర్ల జాబితా ప్రకటన

Telangana CEO Vikas raj interview అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.