Election Commission Grievance Cell : రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలుతో వ్యాపారులు, హవాలాదారులు, పౌరులను ఒకే విధంగా చూస్తూ.. 10 గ్రాములకుపైగా బంగారం, రూ.50 వేలకుపైగా నగదు, కనిపిస్తే చాలు.. రెడ్ హ్యాండెడ్‌గా స్వాధీనం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్(Election Commission) స్పందించింది. సామాన్యులు జప్తు చేసిన సొమ్మును తిరిగి పొందేందుకు.. ప్రతి జిల్లాలో గ్రీవెన్స్‌సెల్‌ను ఏర్పాటు చేసింది.
How to Get Seize Money in Grievance Cell : పోలీసుల నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడ్డ డబ్బు, బంగారు ఆభరణాలను సదరు వ్యక్తులు ఈ సెల్ ఛైర్మన్‌ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లో తిరిగిచ్చేస్తారు. అయితే వీటి విలువ మాత్రం రూ.10 లక్షలలోపు మాత్రమే ఉండాలని.. నిబంధన వర్తింపజేస్తున్నారు. ఒకవేళ అంతకు మించి పట్టుబడితే ఆదాయ పన్నుశాఖ అధికారులకు సంబంధిత వివరాలు వెల్లడించాలి.
అనంతరం వారు విచారణ చేసి.. చట్టపరమైన అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్.. రోజుకు ఇటువంటి పదికిపైగా సమస్యలను పరిష్కరిస్తోంది. సరైన పత్రాలు సమర్పించిన వ్యక్తులకు జప్తు చేసిన సొమ్మును తిరిగి అప్పగించేస్తున్నారు. ఎన్నికల నియమావళి నేపథ్యంలో బంగారం, డబ్బును.. పోలీసులు, తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచి కేసు నమోదు చేస్తారు. సదరు సమాచారాన్ని సంబంధిత యజమానులకు ఇస్తారు. జప్తు చేసిన అనంతరం.. భద్రపరిచిన సొమ్ము వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారం, ఆదాయశాఖ అధికారులకు తెలియజేస్తారు.
గ్రీవెన్స్‌సెల్‌కు దరఖాస్తు చేయండిలా..
- జప్తు చేసిన సొమ్మును తిరిగి పొందాలనుకునేవారు.. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాల పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చూపించాలి. అక్కడి అధికారులు పరిశీలించిన అనంతరం దానిని గ్రీవెన్స్‌సెల్‌కు పంపిస్తారు.
- తరువాత కలెక్టర్ ఆఫీస్‌లోని గ్రీవెన్స్‌సెల్ ఛైర్మన్‌ను కలిస్తే కేసు వివరాలు, ఆధారాలు స్వీకరిస్తారు. వీటికి సంబంధించి ఓ రశీదు ఇచ్చి తమ సెల్ అధికారులు ఫోన్ చేసినప్పుడు రావాలని సూచిస్తారు.
- 48 గంటల్లోపు గ్రీవెన్స్ సెల్ అధికారులు.. సదరు బాధితులను పిలిపించి వారు ఇచ్చిన ఆధారాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. అన్ని వివరాలు సరిగా ఉంటే రిటర్నింగ్ అధికారికి తెలియజేస్తారు.
- ఈ మేరకు రిటర్నింగ్ అధికారి నిర్ధారించాక.. జప్తు చేసిన సొత్తు తిరిగివ్వాలని వాటిని నిల్వ చేసిన పోలీస్‌స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేస్తారు. బాధితులు ఠాణాకు వెళ్లి.. వారి సొమ్మును తీసుకోవాల్సి ఉంటుంది.
2 Crore Money Seize in Karimnagar : కరీంనగర్లో రూ.2.36 కోట్లు సీజ్