ETV Bharat / state

ఓటింగ్​కు దూరంగా పల్లెలు - నిర్మానుష్యంగా పోలింగ్​ కేంద్రాలు - ఇదే కారణం!

Election Boycott in Telangana 2023 : రాష్ట్రమంతటా ఎన్నికల వాతావరణం సందడిగా సాగుతోంది. పలుచోట్ల ఓటర్లు పోటెత్తటంతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే.. మరోవైపు పలు జిల్లాల్లోని గ్రామస్థులు ఓటింగ్ దూరంగా ఉంటూ.. నిరసనగళం ఇప్పుతున్నారు. తమ సమస్యలు పట్టని ప్రభుత్వాలకు ఓటెందుకు వేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. అక్కడి ఓటర్లు అనాసక్తి చూపుతున్నారు. ఇంతకీ వారి సమస్యలేంటి? ఎందుకు ఎన్నికలను బహిష్కరిస్తున్నారో చూద్దామా?

Telangana Assembly Elections 2023
Villagers Election Boycott in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 1:52 PM IST

Election Boycott in Telangana 2023 : రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పోలింగ్​ సమయం రానే వచ్చింది. పలుచోట్ల పెద్ద ఎత్తున ఓటర్లు పోటెత్తటంతో పోలింగ్ కేంద్రాల వద్ద కోలాహలం కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లంతా పాల్గొని.. తమ ఓటు హక్కును(Right to Vote) విధిగా వినియోగించుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల మాత్రం పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు - లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

Telangana Assembly Elections 2023 : ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది ఓటర్ల కోసం నిరీక్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. పలు గ్రామాలు నిరసనల గళం విప్పుతూ.. ఎన్నికల బహిష్కరణకు దిగటమే. ప్రజల గోడు పట్టని ప్రభుత్వాలకు(Government) ఓటెందుకు వేయాలంటూ ఆయా గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించే నాయకులే తప్ప.. తమ సమస్యలకు పరిష్కరించే నాథుడే లేరని వారు వాపోతున్నారు.

Polls Boycott in Adilabad : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామస్థులు పోలింగ్​కు విముఖత చూపుతున్నారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని 23 పోలింగ్ కేంద్రంలో ఉన్న గొల్లఘాట్ గ్రామంలో 270 మంది ఓటర్లు ఉన్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం(Road Facility) లేదని.. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేనందునే ఓటింగ్ బహిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామస్థులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా మాట్లాడినా.. వారు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది ఓటర్ల కోసం నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది.

మీ ఓటు తెలంగాణ బతుకు చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాలి - రాష్ట్ర ప్రజలకు ప్రముఖుల సందేశం

"మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. మిషన్ భగీరథ సౌకర్యం కూడా లేదు. నళ్లాలు ఉన్నాయి కానీ నీటి సదుపాయం లేదు. మాకెటువంటి ఆరోగ్య సమస్య తలెత్తినా సరే ఆసుపత్రి అందుబాటులో లేదు. అంబులెన్స్ వచ్చినా ఊరు అవతల ఆగుతుంది. సరైన రోడ్డు మార్గం లేదు. అక్కడ వరకు రోగులను మేమే ఎడ్లబండిపై తరలించాల్సి వస్తుంది. రోగి ఎమెర్జెన్సీ పరిస్థితిలో ఉండి.. చనిపోయిన దాఖలాలు చాలానే జరిగాయి." - గ్రామస్థుడు

మంచిర్యాలలో ఆందోళన-నిర్మల్‌లో నిరసన : మంచిర్యాల జిల్లా కాచిపేట మండలం వరిపేటలో ఓటు వేయకుండా గ్రామస్థులు నిరసన చేపట్టారు. ఎంతో కాలంగా తమ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని.. ఇప్పటికైనా పంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా పెంబి మండల పరిధిలోని గుమ్మేన, నాయకపోడ్ గూడ, కొలంగూడలో ఓటర్లు నిరసన బాట(Voters Protest) పట్టారు. తమ గ్రామాలకు వెళ్లే రహదారిపై ఉన్న 3 వాగులపై వంతెన నిర్మించాలని డిమాండ్‌ చేశారు. వంతెన లేక రాకపోకలకు తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు.

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజులపాలెంలో ఓటు వేసేందుకు గ్రామస్థులు విముఖత చూపుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్లు అడగడమే తప్ప తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఆందోళనకు దిగారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలనేది వారి ప్రధాన అజెండాగా ఓటర్లు నిరసన తెలిపారు.

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల తంటాలు - పోటాపోటీగా డబ్బు పంపిణీ చేస్తున్న అభ్యర్థులు

వికలాంగుల ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక ఏర్పాట్లు : శైలజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.