ETV Bharat / state

పాలీసెట్‌లో 81 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత - పాలీసెట్‌లో 81 శాతం మంది విద్యార్థులు

రాష్ట్రంలో నిర్వహించిన పాలీసెట్ పరీక్ష‌లో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండు విభాగాల్లోనూ బాలికలు పైచేయి సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో సూర్యాపేట జిల్లాకు చెందిన గడగొజు శ్రీరూప్ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అగ్రికల్చర్‌ విభాగంలో వరంగల్ అర్బన్​కు చెందిన ఆర్షియా జస్మీన్ తొలి ర్యాంకు‍‌ సాధించింది.

Eighty-one percent of students passed in ts Polycet
పాలీసెట్‌లో 81 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత
author img

By

Published : Sep 10, 2020, 7:05 PM IST

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్‌లో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 వేల 920 మంది దరఖాస్తు చేసుకోగా.. 56 వేల 945 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 81.14 శాతంతో 46 వేల 207 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 81.94 శాతంతో 46 వేల 318 మంది ఉత్తీర్ణులయ్యారు.

రెండు విభాగాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో సూర్యాపేట జిల్లాకు చెందిన గడగొజు శ్రీరూప్ 119 మార్కులతో మొదటి ర్యాంకును సాధించారు. 118 మార్కులతో కరీంనగర్‌కు చెందిన పడాల సాయి కౌశిక్ రెండో ర్యాంకు పొందారు. మంచిర్యాలకు చెందిన సకినేటి అనూశ్‌కుమార్ మూడో ర్యాంకు సొంతం చేసుకున్నారు. అగ్రికల్చర్‌లో వరంగల్ అర్బన్‌కు చెందిన ఆర్షియా జస్మీన్ 115.5 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సూర్యాపేటకు చెందిన పుప్పాల రేవక్ సాయి 114.5 మార్కులతో రెండో ర్యాంకు పొందారు. సూర్యాపేటకు చెందిన రావిరాల శ్రీవాత్సవ, నిర్మల్​కు చెందిన తన్మయి 113.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. పాలీసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈనెల 12న ప్రారంభం కానుండగా... ఈనెల 14 నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియకు అవకాశం కల్పించారు.

ఇదీ చూడండి : ఆ పరీక్షల గురించి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.