ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ భారత్​ చొరవతో సమస్యలు పరిష్కారం

ఈనాడు-ఈటీవీ భారత్​ చొరవతో హైదరాబాద్​ రామంతాపూర్​లోని పలు కాలనీల్లో సమస్యలు పరిష్కారమయ్యాయి. కాలనీవాసులు తమ సమస్యలను ఈనాడు-ఈటీవీ భారత్​​ దృష్టికి తీసుకురాగా.. కార్పొరేటర్ జ్యోత్స్న దృష్టికి తీసుకెళ్లారు. ​ఆమె కాలనీల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించారు.

eenadu-etv bharat take intiative to solve colony problems in hyderabad
ఈనాడు-ఈటీవీ భారత్​ చొరవతో సమస్యలు పరిష్కారం
author img

By

Published : May 1, 2020, 8:17 PM IST

లాక్‌డౌన్‌ వేళ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు 'ఈనాడు-ఈటీవీ భారత్‌' దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో వాటి పరిష్కారం కావడం వల్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని నెహ్రూనగర్‌, శ్రీనగర్‌ కాలనీలో రోడ్డుపై మ్యాన్‌హోల్స్​ను శుభ్రం చేసి మట్టిని అలాగే రోడ్డుపై నిల్వ చేశారని, దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని "ఈనాడు-ఈటీవీ భారత్‌" దృష్టికి కాలనీవాసులు తీసుకొచ్చారు. అలాగే కేసీఆర్‌నగర్‌ కాలనీలో రాత్రి వేళ దోమల బెడత తీవ్రంగా ఉందని ఆ కాలనీవాసులు తెలిపారు. విషయాన్ని కార్పొరేటర్‌ గంధం జ్యోత్స్న దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్పందించారు. ఆయా కాలనీలలో పర్యటించారు. ప్రతి ఇంటి ముందు దోమల నివారణ కోసం పొగ మందు వేయించారు. మట్టి కుప్పలను సిబ్బందితో శుభ్రం చేయించారు.

ఇవీ చూడండి: కరోనా లక్షణాలు ఉంటేనే ఆసుపత్రిలో చికిత్స : మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.