ETV Bharat / state

schools reopen : రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి బడులు, కాలేజీలు...! - తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం

తెలంగాణలో విద్యాసంస్థలు తెరిచేందుకు కసరత్తు జరుగుతోంది. సెప్టెంబరు 1 నుంచి పునః ప్రారంభించేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై ఈ వారంలో సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. తొలుత 8నుంచి ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని భావిస్తున్నారు.

schools
schools
author img

By

Published : Aug 13, 2021, 5:00 AM IST

రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరిచేందుకు కసరత్తు జరుగుతోంది. సెప్టెంబరు 1 నుంచి పునఃప్రారంభించేందుకు విద్యా శాఖ రంగం సిద్ధం చేస్తోంది. మొదట 8 నుంచి ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం పచ్చజెండా ఊపితే... తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యాలు, తల్లిదండ్రుల సంఘాలతో త్వరలో సమావేశాలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు.. సెప్టెంబరు నెలాఖరులో మొదటి సంవత్సరం పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

కరోనా ప్రభావంతో గత మార్చిలో విద్యా సంస్థలు మూత పడ్డాయి. మధ్యలో తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. రెండో దశ తీవ్రత పెరగడం వల్ల మరళా ఆన్​లైన్ బోధనకే పరిమితం చేశారు. గత నెల 1 నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. హైకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గింది. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు యునిసెఫ్, పార్లమెంటరీ కమిటీ, ఐసీఎంఆర్​తో పాటు.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కూడా విద్యా సంస్థలు తెరవొచ్చునని సూచించాయి.

వారం రోజుల్లో స్పష్టమైన ప్రకటన..!

దేశంలోని పలు రాష్ట్రాలు ఈ నెలలోనే విద్యా సంస్థలు తెరుస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని.. సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి ఆపై తరగతులు ప్రారంభించాలని విద్యా శాఖ ప్రతిపాదించింది. అయితే నిమజ్జనంపై ఆంక్షలు లేనట్లయితే.. వినాయక చవితి ఉత్సవాలు పూర్తయ్యాక సెప్టెంబరు మూడో వారంలో ప్రారంభించాలని మరో ప్రతిపాదన కూడా ఉంది. ప్రతిపాదనలను ఉన్నతాధికారులు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమర్పించారు. సబితా ఇంద్రారెడ్డి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్​తో చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ అంగీకరిస్తే... వారం రోజుల్లో అధికారికంగా స్పష్టమైన ప్రకటన చేయాలని భావిస్తున్నాయి.

కోర్టు ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని

విద్యా సంస్థలు తెరిచే ముందు యాజమాన్యాలు, తల్లిదండ్రులను సన్నద్ధం చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. త్వరలోనే యాజమాన్యాలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో హైకోర్టు నుంచి ఎదురైన ప్రశ్నలను దృష్టిలో ఉంచుకొని.. కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. వాటిని వీలైనంత ముందుగా విస్తృత అవగాహన కల్పించాలని ఆలోచిస్తున్నారు.

ఇంటర్​ రెండో సంవత్సరం పరీక్షలు

ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు... సెప్టెంబరు నెలాఖరులో మొదటి సంవత్సరం పరీక్షలు జరపాలని భావిస్తున్నారు. కరోనా తీవ్రత కారణంగా వారికి మొదటి సంవత్సరం పరీక్షలు జరపకుండానే.. రెండో సంవత్సరానికి ప్రమోట్ చేశారు. ఒకవేళ రెండో సంవత్సరం పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి వస్తే.. మార్కులు వేసేందుకు ప్రాతిపదిక ఉండదు కాబట్టి.. కచ్చితంగా మొదటి సంవత్సరం పరీక్షలు జరపాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదించింది.

ఇదీ చూడండి: SCHOOLS REOPEN: ఆగస్టు 15 తర్వాత బడులు తెరుద్దాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.