రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతాయని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తొమ్మిదో తరగతి నుంచి విద్యాసంస్థలు తెరవనున్నట్లు స్పష్టం చేశారు.
వచ్చేనెల నుంచి ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటాయని మంత్రి తెలిపారు. విద్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోగ్య భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.