ETV Bharat / state

ప్రపంచ ర్యాంకుల్లో తెలంగాణ విద్యాసంస్థలు

తెలంగాణలోని కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఈసారి తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి. టాప్ 100 జాబితాలో కొత్తగా సీబీఐటీ చేరగా.. వరంగల్ ఎన్​ఐటీ 17 స్థానాలు మెరుగైంది. దేశవ్యాప్తంగా ఐఐటీ చెన్నై తొలిస్థానం దక్కించుకుంది.

తెలంగాణ విద్యాసంస్థల హవా
author img

By

Published : Apr 9, 2019, 11:29 AM IST

దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యాసంస్థల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాసంస్థలు జాతీయస్థాయిలో ఉత్తమ స్థానాలు సాధించాయి. హైదరాబాద్‌లోని సీబీఐటీ ఇంజినీరింగ్‌ విభాగంలో తొలి 100 ర్యాంకుల్లో చోటు దక్కించుకుంది. ఎన్‌ఐటీ వరంగల్‌ ఏకంగా 17 స్థానాలను మెరుగుపర్చుకుని 61వ స్థానంలోకి దూసుకొచ్చింది.

ఐఐటీ మద్రాస్ మొదటి స్థానం...
జాతీయస్థాయిలో ఐఐటీ మద్రాస్‌ ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంటే... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు రెండో స్థానంతో సరిపెట్టుకుంది. రాష్ట్రం నుంచి ఐఐటీ హైదరాబాద్ ఒక స్థానం వృద్ధితో ​8వ ర్యాంకు సాధించింది.
ప్రపంచ జాబితాలో భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో 2016 నుంచి ఈ ర్యాంకులు రూపొందిస్తున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ పేరిట... విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌, జనరల్‌ కళాశాలలు, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, న్యాయ విద్య, ఆర్కిటెక్చర్‌, మెడికల్‌ విద్యాసంస్థల వంటి 9 విభాగాల్లో ర్యాంకులు ప్రకటిస్తున్నారు. ఎన్నికల నియమావళి కారణంగా ఈసారి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ జాబితా విడుదల చేశారు.

తెలంగాణ విద్యాసంస్థల హవా

ముఖ్యమైన 3 విభాగాల్లో తెలంగాణ ఫలితాలు...

విద్యాసంస్థ 2018 2019 తేడా
హెచ్‌సీయూ 11 11 0
ఐఐటీ హైదరాబాద్‌ 22 22 0
ఓయూ 45 43 + 2
ఎన్‌ఐటీ వరంగల్‌ 78 61 + 17

విశ్వవిద్యాలయాల విభాగంలో...

విద్యాసంస్థ 2018 2019 తేడా
హెచ్‌సీయూ 5 4 +1
ఓయూ 28 26 +2
అగ్రికల్చరల్‌ వర్సిటీ 82 79 +3
ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ 98 82 +16

ఇంజినీరింగ్‌ విభాగంలో...

విద్యాసంస్థ 2018 2019 తేడా
ఐఐటీ హైదరాబాద్‌ 9 8 +1
ఎన్‌ఐటీ వరంగల్‌ 25 26 -1
ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ 38 39 -1
జెఎన్‌టీయూ హెచ్‌ 42 45 -3
ఓయూ ఇంజినీరింగ్‌ 80 83 -3

తొలిసారిగా సాధారణ కళాశాలల విభాగంలో హైదరాబాద్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాల 95వ స్థానం దక్కించుకుంది. మేనేజ్‌మెంట్‌ విభాగంలో హైదరాబాద్‌ శివారులోని ఇక్ఫాయ్‌కు 26, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీకి 67వ స్థానం దక్కింది. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని కేంద్రీయ సంస్థ నైపర్‌ 6వ స్థానంలో నిలిచింది. సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ కళాశాల 65వ స్థానాన్ని సాధించింది. న్యాయ విభాగంలో హైదరాబాద్‌లోని నల్సార్‌ మూడో స్థానం పొందింది. ఆర్కిటెక్చర్‌, మెడికల్‌లో ఒక్క విద్యాసంస్థకి కూడా చోటు దక్కలేదు.

ఇవీ చూడండి: 'నేటి సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారానికి తెర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.