ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచినట్లయితే... ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించొచ్చని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అన్నారు. పేదరికం వల్ల చాలా మంది విద్యార్థుల వద్ద నిఘంటువులు లేవని... నిఘంటువు వల్ల ఆంగ్లభాషలో ప్రావీణ్యం పెంచుకునేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ పాఠశాల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న 48 వేల మంది విద్యార్థులకు నిఘంటువులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అబిడ్స్‌లోని మహబూబియా బాలికల పాఠశాల విద్యార్థులకు జిల్లా విద్యా అధికారిణి వెంకట నరసమ్మతో కలిసి నిఘంటువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యా శాఖ నుంచి బదిలీ అవుతున్న జనార్దన్‌రెడ్డిని.. హైదరాబాద్ డీఈవోతో పాటు పలువురు అధికారులు సన్మానించారు.