తాము చదివిన పాఠశాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల పాఠశాల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రూ.కోటి పది లక్షల వ్యయంతో నూతన తరగతి గదులు, ఆడిటోరియం ఏర్పాటు చేశారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్న పూర్వ విద్యార్థులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం, స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వాడిపారేసిన ప్లాస్టికే... రోడ్డు పక్కన స్టాళ్లైతే.. ఇలా ఉంటాయి!