నూతన జాతీయ విద్యా విధానంపై దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అభిప్రాయపడింది. నూతన విద్యా విధానం పత్రాలను అన్నీ భాషల్లో సమగ్రంగా ముద్రించాలని... జాతీయ స్థాయిలో చర్చించేందుకు 6 నెలల నుంచి ఏడాది సమయం ఇవ్వాలని కోరారు. ఏ దేశాన్నినైనా నాశనం చేయాలంటే విద్య పాడుచేస్తే చాలని... ఆ విధానాలను మన నేతలు ఆచరిస్తున్నారని జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన, ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని అన్నారు. విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సింది పోయి కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రొ.విశ్వేశ్వర్రావు, జస్టిస్ చంద్రకుమార్, పలువురు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఆ ఫలితాలే కూటమి పతనానికి బాటలు!